Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే దక్కుతుంది. ఇక మాస్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లిన బాలయ్య బాబు (Balayya Babu) తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ యావత్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వరుసగా విజయాల బాటపడుతూ ముందుకు సాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం అతని అభిమానులు సైతం బాలయ్య బాబు చేస్తున్న సినిమాలను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో ‘అఖండ 2’ (Akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు ఒకప్పుడు మాస్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాని చిరంజీవి చేశాడనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘మున్నా బాయ్ ఎంబిబిఎస్’ సినిమాని తెలుగులో దర్శకుడు జయంత్ సి పరంజి బాలయ్య బాబుతో రీమేక్ చేయాలని అనుకున్నారట.
Also Read: మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ సినిమాను చేయడం వల్లే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడా..?
ఇక బాలయ్య బాబు(Balayya Babu) కి అతనికి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. అందువల్లే ఆయన బాలయ్యతో ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారట. కానీ ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ మాత్రం చిరంజీవి వైపు మొగ్గు చూపడంతో ఆయన చిరంజీవితో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ (Shankar Dada MBBS) అనే పేరుతో రీమేక్ చేసి చేశాడు.
ఇంకా ఫైనల్ గా సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా దర్శకుడిగా అతనికి చాలా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. మొత్తానికైతే చిరంజీవి ఇందులో ఒక డిఫరెంట్ మేనరిజంతో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా చిరంజీవి నటించి ప్రేక్షకులందరి మన్ననలను పొందాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా అందించిన విజయం ఒక మంచి బూస్టప్ ని కూడా ఇచ్చింది.
ఆ తర్వాత కూడా చిరంజీవి అలాంటి సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకున్నారు అంటే ఈ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ప్రస్తుతం చిరంజీవి 70 సంవత్సరాల వయసులో కూడా పోటీని పడితే విశ్వబ్రాణి సినిమా చేస్తున్నాడు మరి ఈ సినిమాతో తనతో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: ఇంటర్నేషనల్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ..అదృష్టం అంటే ఇదే!