Up Coming Cars : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు మరికొన్ని రోజులు ఆగండి. దేశంలో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో 3 కొత్త అదిరిపోయే కార్లు రాబోతున్నాయి. వీటిలో చిన్న SUV నుండి ఒక హైబ్రిడ్, ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు వరకు ఉన్నాయి. భారతదేశ కార్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు మార్కెట్‌లో కార్ల సగటు ధర రూ. 10 నుండి 12 లక్షల వరకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో రానున్న ఈ కార్లు మీ బడ్జెట్‌లో సరిపోతాయి.. పర్ఫామెన్స్ లో అదరగొడతాయి.
Also Read: లాన్ మస్క్.. మూడు దేశాల నుంచి ప్రపంచ కుబేరుడి ఒడిలోకి..
రానున్న 3 అదిరిపోయే కార్లు ఇవే
తక్కువ బడ్జెట్‌లో మంచి SUV కోసం చూస్తున్నట్లయితే Hyundai Venue నెక్స్ట్ జనరేషన్ కోసం వెయిట్ చేయొచ్చు. ఈసారి Hyundai Venue N-లైన్ వెర్షన్ కూడా అప్‌డేట్ అయ్యి రావొచ్చచు.. ఈ కొత్త మోడల్‌లో కేవలం ఎక్స్‌టీరియర్ డిజైన్‌లోనే కాకుండా 16 ఇంచుల అల్లాయ్ వీల్స్, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, ADAS సేఫ్టీ ఫీచర్లు కూడా లభించవచ్చు. అయితే కారులో మీకు ప్రస్తుతం ఉన్న 1 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు కొనసాగవచ్చు.
తక్కువ బడ్జెట్‌లో హైబ్రిడ్ కారు కావాలని అనుకుంటే.. Maruti Suzuki Fronx Hybrid ట్రై చేయవచ్చు. ఇది మారుతి అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో ఒకటి. మారుతి ఫ్రాంక్స్‌లో ప్రస్తుతం 1.2 లీటర్ ఇంజన్ ఉంది. ఇది స్విఫ్ట్ , డిజైర్ ఇంజన్ల మాదిరిగానే ఉంటుంది. కంపెనీ సొంతంగా మొదటిసారి హైబ్రిడ్ కారును అభివృద్ధి చేస్తోంది. మారుతి ఫ్రాంక్స్ ఆ కారు అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల కంటే తక్కువ లేదా ఆ ప్రాంతంలో ఉండవచ్చు.
రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో ఎదురుచూస్తున్న మరో కారు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు Tata Altroz ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. ఈ కారు గ్రిల్ నుండి హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ వరకు మార్పులు జరగబోతున్నాయి. ఇది మే 21న విడుదల కానున్నట్లు సమాచారం. ఇది పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్‌లలో లభిస్తుంది.
Also Read: ఒక్క క్లిక్‌తో ఇన్కాగ్నిటో మోడ్ హిస్టరీ డిలీట్ చేయండి