NTR And Ram Charan: సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ అయితే నడుస్తుంది. ఒక హీరో కంటే ఒకరు ఎక్కువ అని నిరూపించుకోవడానికి ప్రతి హీరో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని డిఫరెంట్ గా ఏమైతే చేయగలరు అవన్నీ చేసేస్తున్నారు. ఇక పర్సనల్ గా మంచి ఫ్రెండ్స్ అయినప్పటికి హీరోల మధ్య మాత్రం సినిమాల పరంగా చాలా మంచి పోటీ అయితే ఉంది. ఇలా హీరోల మధ్య పోటీ వాతావరణం ఉన్నప్పుడే మంచి సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుందంటూ కొంతమంది సినిమా విమర్శకులు సైతం వీళ్ళ పోటీ మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ (Ram Charan) చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా మారిపోయాడు. మరి ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇక నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎవరిని పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ వైవిద్య భరితమైన కథాంశాలతో తెరకెక్కినవే కావడం విశేషం. అయితే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన త్రిబుల్ ఆర్ (RRR) సినిమా సూపర్ సూపర్ సక్సెస్ ను సాధించింది.
Also Read: మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ సినిమాను చేయడం వల్లే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడా..?
ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే కాకుండా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్ (NTR) లను సైతం స్టార్ హీరోలుగా మలిచాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే ఉద్దేశంతో తమ అభిమానులు అయితే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ అయితే ఉంది.
ఇక రామ్ చరణ్ ఎలాంటి క్యారెక్టర్ నైనా సరే చాలా పర్ఫెక్షన్ తో నటించి తనకున్న టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా టాప్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ రామ్ చరణ్ లో అయితే లేదని చాలామంది అతన్ని విమర్శిస్తూ ఉంటారు.
జూనియర్ ఎన్టీఆర్ ఏకసంతాగ్రహి ఎంత పెద్ద డైలాగ్ అయిన ఎంత టిపికల్ డాన్స్ మూమెంట్ అయిన సరే సింగల్ టేక్ లో చేస్తాడు. అందుకే ఎన్టీఆర్ మిగతా హీరోలందరి కంటే కూడా సపరేట్ గా నిలిచారనే చెప్పాలి. ఇక ఇంతవరకు ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో ఆయన ఇలాంటి ఒక అద్భుతమైన టాలెంట్ ని కలిగి ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
Also Read: హిట్ 3 మీద బజ్ మామూలుగా లేదుగా మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందంటే..?