Homeఎంటర్టైన్మెంట్Jr NTR Name : సీనియర్ ఎన్టీఆర్ దానం చేసిన పేరు కథ.. ఓ పవర్...

Jr NTR Name : సీనియర్ ఎన్టీఆర్ దానం చేసిన పేరు కథ.. ఓ పవర్ ఫుల్ స్టార్ హీరో ఆవిర్భావం…

Jr NTR Name  : ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ప్రతి ఒక్క హీరో మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు సైతం మంచి సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి ముందుకు సాగుతున్నాడు...

Jr NTR Name  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా మంచి విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం బాధ్యతలను ముందుకు తీసుకెళుతున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా కొనసాగడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు…ఇక ఎన్టీఆర్ పేరు వెనక ఉన్న రహస్యాన్ని హరికృష్ణ ‘నాన్నకు ప్రేమతో’ (Nanna Ki Prematho) సినిమా సమయంలో తెలియజేయడం విశేషం…ఇక ప్రస్తుతం ఆ పేరుకు సంబంధించిన బ్యాక్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

Also Read :ఇప్పుడు నువ్వు హ్యాపీనా.. కెజిఎఫ్ హీరోయిన్ కి చుక్కలు చూపించిన నాని, మామూలు ర్యాగింగ్ కాదు

నాన్నకు ప్రేమతో సినిమా ఈవెంట్లో నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ తన ఇద్దరి కొడుకుల పేర్లు జానకిరామ్, కళ్యాణ్ రామ్ అని పెట్టానని జూనియర్ ఎన్టీఆర్ పేరు విషయంలో తను వాళ్ళిద్దరి పేరు వెనకాల రామ్ అని పెట్టాను కాబట్టి ఇతని పేరు వెనకల కూడా రామ్ అని వచ్చేలా తారక్ రామ్ అని పెట్టానని చెప్పాడు. ఒకానొక సమయంలో ‘విశ్వామిత్ర’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణతో మీ మూడో వాడు ఏం చేస్తున్నాడు అని అడిగాడట.

దాంతో హరికృష్ణ చదువుకుంటున్నాడని చెప్పడంతో ఒకసారి వాడిని తీసుకొని రమ్మని చెప్పాడట. అప్పుడు హరికృష్ణ తారక్ రామ్ ను తీసుకువచ్చాడు… ఇక అప్పుడు సీనియర్ ఎన్టీఆర్(Sr NTR) నీ పేరు ఏంటి అని అడగగా నాన్న గారు తారక్ రామ్ అని పెట్టారని చెప్పాడట. ఇక అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కోపంగా తారక్ రామ్ కాదు నీ పేరు ఎన్టీఆర్ నువ్వు నా అంశతో పుట్టావు అంటూ ఆయన చాలా గర్వంగా చెప్పాడట.

ఇక అది చూసిన హరికృష్ణ నాన్నగారు తన పేరును తనే దానం చేసుకున్నాడు. బహుశా ఈ సమయంలో ఆ పేరుకు తగ్గ గుర్తింపును తీసుకొచ్చేవాడు జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన అప్పుడే పసిగట్టి తనకు ఆ పేరు పెట్టారేమో అంటూ చెప్పాడు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper