Shubman Gill Captain: గిల్ ను సారధిగా ప్రకటిస్తారని కొంతకాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ.. దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. మొత్తంగా ఊహాగానమని అందరూ అనుకున్నారు. పైగా సీనియర్లు మొత్తం బుమ్రా వైపు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. ఖచ్చితంగా అతడే కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా గిల్ పేరు టీమిండియా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే రాత్రికి రాత్రే గిల్ పేరు ప్రకటించలేదని.. దాని వెనుక చాలా జరిగిందని.. అసలు అతడిని సారధిగా తీసుకోవలసిన అవసరం ఎందుకొచ్చిందో.. అజిత్ అగార్కర్ తన మాటల ద్వారా చెప్పేశాడు.
కొత్త కెప్టెన్ నియామకంపై భారత జట్టు ఏడాది నుంచే యాజమాన్యం కసరత్తు చేస్తోంది. మిగతా ఫార్మాట్లలో టీమిండియా కు వంక పెట్టడానికి లేకపోయినప్పటికీ.. సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి ఇబ్బంది తర్వాత ఏర్పడుతోంది. ముఖ్యంగా కివీస్, కంగారులతో జరిగిన సిరీస్లలో భారత టెస్టుదళం లో ఉన్న డొల్లతనం బయటపడింది. ముఖ్యంగా కివీస్ జట్టుతో జరిగిన సిరీస్లో భారత్ సున్నా కి పరిమితం కావడం మేనేజ్మెంట్ కు ఏమాత్రం రుచించలేదు. అందువల్లే జట్టుకు కొత్త సారధిని నియమించడం అనివార్యం అని భావించింది.
సారథి విషయంలో జట్టు మేనేజ్మెంట్ ఒకే మాట మీద ఉండడంతో రోహిత్ శర్మ కు తదుపరి అవకాశమంటూ లేకుండా పోయింది. దీంతో అతడు తన సారద్య బాధ్యతతో పాటు.. సుదీర్ఘ ఫార్మాట్లో తన స్థానానికి కూడా శాశ్వత వీడ్కోలు పలికాడు. రోహిత్ ఆనంతరం తనకు నాయకత్వ బాధ్యతలు కావాలని విరాట్ కోహ్లీ కోరితే.. మేనేజ్మెంట్ సున్నితంగా తిరస్కరించింది. దీంతో అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి దూరం జరిగిపోయాడు. ఈ పరిణామాలు మేనేజ్మెంట్ ఊహించనివే అయినా.. వెంటనే తేరుకుంది. ఇద్దరు సీనియర్ ప్లేయర్లు వైదొలిగి వెళ్లిపోవడంతో.. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి టీం మీడియా మేనేజ్మెంట్ ఎప్పటినుంచో రంగంలోనే ఉంది. కాకపోతే ఈసారి ప్లాన్ ఏ కాకుండా ప్లాన్ బి ని అమలులో పెట్టింది.
గిల్ నాయకత్వాన్ని బలవంతంగా జట్టు మీద రుద్దకుండా.. మేనేజ్మెంట్ మొదటి నుంచే జాగ్రత్త పడింది. అన్నిటికంటే ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తీసుకుంది. అందువల్ల మేనేజ్మెంట్ కు పని ఈజీ అయింది. డ్రెస్సింగ్ రూమ్ ఎదుట అనేక ప్రపోజల్స్ ఉంచితే.. అందులో మెజారిటీ అభిప్రాయాలను మేనేజ్మెంట్ లెక్కలోకి తీసుకుంది. ఆ తర్వాత సారధిగా నియమించుకోవాలనుకున్న వ్యక్తి ప్రొఫైల్.. ఇటీవల ఆట తీరు.. సాధించిన పరుగులు.. మైదానంలో అతడి సామర్థ్యం.. జట్టును నడిపించే విధానం.. ఆటగాళ్లతో కలిసి ఉండే విధానం.. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మొత్తంగా సారధిని ఎంపిక చేసింది. గిల్ విషయంలో మేనేజ్మెంట్ ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరించింది. ఆచితూచి అడుగులు వేసింది. అంతిమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. విమర్శలకు అవకాశం లేకుండా గిల్ ను సారధిగా ఎంపిక చేసింది. మొత్తంగా కెప్టెన్ ఎంపిక విషయంలో ఇంత కసరత్తు జరిగింది. అందువల్లే అజిత్ అగర్కర్ ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఒక్క విమర్శ కూడా రాలేదు. ఏ సీనియర్ ఆటగాడు కూడా ఆరోపణలు చేయడానికి సాహసించలేదు.