Homeఎంటర్టైన్మెంట్Hero Nani : ఇప్పుడు నువ్వు హ్యాపీనా.. కెజిఎఫ్ హీరోయిన్ కి చుక్కలు చూపించిన నాని,...

Hero Nani : ఇప్పుడు నువ్వు హ్యాపీనా.. కెజిఎఫ్ హీరోయిన్ కి చుక్కలు చూపించిన నాని, మామూలు ర్యాగింగ్ కాదు

Hero Nani : కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హిట్ 3 చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అరంగేట్రంతోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 భారీ విజయం నమోదు చేసుకుంది. మే 1న విడుదలైన హిట్ 3 మూవీ వరల్డ్ వైడ్ రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యూఎస్ లో హిట్ 3 చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. వన్ మిలియన్ వసూళ్లకు పైగా రాబట్టింది. అర్జున్ సర్కార్ పాత్రలో వైలెన్స్ కి మరో అర్థం చెప్పాడు హీరో నాని.

హిట్ 3 చిత్రానికి షాకింగ్ ఓపెనింగ్స్ దక్కాయి. అందుకు హీరో నాని ఆఫ్ స్క్రీన్ హార్డ్ వర్క్ కూడా కారణం అనాలి. ఈ చిత్రాన్ని ఆయన విపరీతంగా ప్రోమోట్ చేశాడు. చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అనే తేడా లేకుండా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి సైతం నానికి సహకరించింది. పలు ఇంటర్వ్యూలలో నాని తో శ్రీనిధి శెట్టి జాయిన్ అయ్యింది. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని-శ్రీనిధి మధ్య ఆసక్తికర వాదన చోటు చేసుకుంది. శ్రీనిధి నోరు మూయించిన నాని, ఒక విధంగా ర్యాగింగ్ చేశాడు.

Also Read : హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఈ నెలలో లేనట్టే..సంచలన ప్రకటన చేసిన డైరెక్టర్!

విషయంలోకి వెళితే.. శ్రీనిధి చిన్నప్పటి నుండి నా సినిమాలు చూస్తుందట. అది ఎలా సాధ్యం. కనీసం ఆమె స్కూల్ డేస్ లో ఉన్నప్పటికి కూడా నేను హీరో అయ్యి ఉండను.. అన్నాడు. ఒకే అయితే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు.. ఇప్పుడు నువ్వు హ్యాపీనా.. అని శ్రీనిధి సమాధానం చెప్పింది. అప్పటి కూడా కాదు అని నాని వాదించాడు. శ్రీనిధి వయసుతో తన వయసుకు పెద్దగా వ్యత్యాసం లేదన్న అర్థంలో నాని వాదించాడు. వారిద్దరి వయసు పరిశీలిస్తే.. 1992లో పుట్టిన శ్రీనిధి ప్రస్తుత వయసు 32 ఏళ్ళు. ఇక నాని 1984లో పుట్టాడు వయసు 41 ఏళ్ళు. నాని కంటే శ్రీనిధి శెట్టి 9 ఏళ్ళు చిన్నదన్న మాట.

ఆ విషయం పక్కన పెడితే హిట్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మే 29 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన చేసింది. విడుదలై నాలుగు వారాలు ముగియక ముందే హిట్ 3 మూవీ ఓటీటీలోకి రావడం విశేషం. హిట్ సిరీస్ లో మూడో చిత్రంగా హిట్ 3 తెరకెక్కింది. నాని స్వయంగా నిర్మించి నటించారు. హిట్ 3లో హీరో కార్తీ గెస్ట్ రోల్ చేసిన నేపథ్యంలో హిట్ 4 హీరో ఆయనే అనే ప్రచారం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular