Homeఎంటర్టైన్మెంట్Johnny Master allegations : జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ కొత్త ఆరోపణలు... సున్నితమైన...

Johnny Master allegations : జానీ మాస్టర్ పై లేడీ కొరియోగ్రాఫర్ కొత్త ఆరోపణలు… సున్నితమైన విషయాన్ని బయటపెట్టిందిగా!

Johnny Master allegations : జానీ మాస్టర్ ఉదంతం టాలీవుడ్ ని కుదిపేసింది. ఆయన వద్ద పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ లైంగికంగా వాడుకున్నాడు అంటూ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే ముంబై హోటల్ లో జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని ఆమె అన్నారు. అనంతరం పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. మాట వినకపోతే కొట్టేవాడు. మతం మార్చుకుని తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆయన భార్య అయేషా సైతం సహకరించింది. ఆమె సైతం తనను శారీరకంగా హింసించింది అంటూ తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తింది.

యువతి కేసును స్వీకరించిన పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. రిమాండ్ కి పంపారు. లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలను జానీ మాస్టర్, ఆయన భార్య ఖండించారు. ఆమె ఆరోపణల్లో నిజం లేదు. జానీ మాస్టర్ ని కెరీర్ పరంగా దెబ్బ తీసేందుకు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. లేడీ కొరియోగ్రాఫర్ వెనుక కొందరు పెద్దలు ఉన్నారంటూ ఆరోపించారు. జైలుపాలైన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు సైతం కోల్పోయాడు. ప్రభుత్వం జానీ మాస్టర్ ని అనర్హుడిగా ప్రకటించి అవార్డు వెనక్కి తీసుకుంది.

కాగా అప్పుడప్పుడు వీరి మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లేడీ కొరియోగ్రాఫర్ సున్నితమైన అంశాన్ని లేవనెత్తింది. జానీ మాస్టర్ తన ఇద్దరు పిల్లలకు ముస్లిం పేర్లనే ఎందుకు పెట్టారు? ఒకరికి హిందు, ఒకరికి ముస్లిం పేరు పెట్టొచ్చుగా? ఎలాంటి పేర్లు పెట్టాలనే విషయంలో వారికి స్వేచ్ఛ ఉంది. అది వారి ఇష్టం. కానీ ఒక సనాతని హిందూ అమ్మాయిని వివాహం చేసుకున్న జానీ మాస్టర్ ఇద్దరికీ ముస్లిం పేర్లు ఎందుకు పెట్టాడు? అంటూ సున్నితమైన అంశాన్ని లేవనెత్తింది.

జానీ మాస్టర్ భార్య అయేషా నిజానికి హిందూ అమ్మాయి. వివాహం అనంతరం ఆమె పేరు మతం మార్చుకున్నారు. పుట్టకతో అయేషా హిందువు అయినప్పుడు తన ఇద్దరు పిల్లల్లో ఒకరికి హిందూ పేరు పెట్టొచ్చుగా అనే కోణంలో లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేసింది. ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణల మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు మద్దతు ఇస్తుండగా, కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్ తిరిగి బిజీ అయ్యాడు. ఆయన పలు భాషల్లో పని చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular