Homeఎంటర్టైన్మెంట్Tollywood Director Comments: తెలుగు హీరోలతో సినిమాలు చేయడం వేస్ట్ అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్...

Tollywood Director Comments: తెలుగు హీరోలతో సినిమాలు చేయడం వేస్ట్ అంటున్న టాలీవుడ్ స్టార్ డైరెక్టర్…

Tollywood Director Comments: కొంతమంది దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం కంటే బయట హీరోలతో సినిమాలు చేయడం చాలా ఉత్తమమని భావిస్తున్నారు. కారణం ఏంటి అంటే మన హీరోలు ఒక కథ విన్న తర్వాత వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ కథలో మార్పులు చేర్పులు చేయమని చెబుతుంటారు. దానివల్ల సినిమాలోని సోల్ చచ్చిపోతుంది. ఇక ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చడంలో కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన హీరోలతో పోలిస్తే బయటి హీరోలు ఏది […]

Tollywood Director Comments: కొంతమంది దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడం కంటే బయట హీరోలతో సినిమాలు చేయడం చాలా ఉత్తమమని భావిస్తున్నారు. కారణం ఏంటి అంటే మన హీరోలు ఒక కథ విన్న తర్వాత వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఆ కథలో మార్పులు చేర్పులు చేయమని చెబుతుంటారు. దానివల్ల సినిమాలోని సోల్ చచ్చిపోతుంది. ఇక ఆ సినిమా ప్రేక్షకుడికి నచ్చడంలో కూడా ఫెయిల్ అయిపోతుంది. అందుకే మన హీరోలతో పోలిస్తే బయటి హీరోలు ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తూ సినిమాని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కాబట్టి మన దర్శకులు సైతం ఇతర హీరోలతోనే సినిమాలు చేస్తున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు చేసిన వరుస సినిమాలు తెలుగు హీరోలకు చెప్పినప్పటికి వాళ్లందరూ ఆ కథల్లో మార్పులు చేయమని చెప్పారట. దాంతో ఆయన మన హీరోలతో సినిమాలు చేసే కంటే బయటి హీరోలతో చేస్తేనే బెటర్ అని ధనుష్ తో సార్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.

ఇక ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా చేసి ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం సూర్య తో మరో సినిమా చేస్తున్నాడు. మొత్తానికైతే తమిళ్, మలయాళం హీరోలైతేనే మనకు కంఫర్ట్ గా ఉంటారని భావిస్తున్నారు. ఇక వాళ్ళతో సినిమాలు చేస్తేనే సక్సెస్ సాధించవచ్చు.

వాళ్ళు మనం చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తారని ఇమేజ్ చట్రం లో ఇరుక్కుపోయి కథని స్పయిల్ చేయరనే ఉద్దేశ్యంతో వెంకీ అట్లూరి వాళ్లతో సినిమాలు చేస్తున్నట్టుగా తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలు వాళ్ళ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది.

పాన్ ఇండియాలో మన సినిమాలు విస్తరిస్తున్న క్రమంలో కథకి వాల్యూ ఇవ్వాలి గాని, వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా కథ ఉందా లేదా అందులో మార్పులు చేర్పులు చేయమని సినిమా కథకి అవసరం లేకపోయిన కొన్ని ఎలిమెంట్స్ ని యాడ్ చేయమని చెప్పడం వల్ల సినిమా కథ దెబ్బతింటుంది. దానివల్ల ప్రేక్షకులు సైతం సినిమాకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు… ఆ విషయాన్ని తెలుసుకొని హీరోల కోసం కాకుండా మంచి కథను ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper