Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan release date confirmed: ఎట్టకేలకు 'జన నాయగన్' విడుదల తేదీ ఖరారు.. ఈసారి...

Jana Nayagan release date confirmed: ఎట్టకేలకు ‘జన నాయగన్’ విడుదల తేదీ ఖరారు.. ఈసారి టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు..

Jana Nayagan release date confirmed: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా పేర్లలో ఒకటి ‘జన నాయగన్'(Jana Nayagan Movie). తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ఈ చిత్రం , ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు మెంబెర్స్ సర్టిఫికేట్ నిరాకరించడంతో ఇన్ని రోజులు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన […]

Jana Nayagan release date confirmed: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా పేర్లలో ఒకటి ‘జన నాయగన్'(Jana Nayagan Movie). తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ఈ చిత్రం , ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డు మెంబెర్స్ సర్టిఫికేట్ నిరాకరించడంతో ఇన్ని రోజులు ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే వస్తుందని అనుకున్నారు కానీ, అది కూడా జరగలేదు. దీంతో ఈ సినిమా విడుదల మరికొన్ని నెలలు వాయిదా పడుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని మే 8 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే జరిగిన తమిళనాడు ఎన్నికలకు సంబందించి ఫలితాలు మే 4 న రాబోతుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజులకే ఈ సినిమాని విడుదల చేయడం వల్ల, మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుందని , అప్పటి మే 4 లోపు సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలామంది తమిళనాడు లో విజయ్ TVK పార్టీ విజయం సాదిస్తుందని, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని అంటున్నారు. మరికొంత మంది అయితే , విజయ్ కి సీట్లు రాకపోయినా భారీ ఓటు షేర్ వస్తుందని అతను పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలుస్తాడని అంటున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే , విజయ్ పార్టీ ప్రభావం అంతగా ఉండదని , ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓడిపోతాడని, ఓటు షేర్ 10 శాతం కంటే తక్కువ ఉంటుందని అంటున్నారు. వీటిల్లో ఏది నిజం అవుతుందో తెలియదు కానీ , పైన ఏది జరిగినా విజయ్ పేరు నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ లోన్ ట్రెండ్ అవ్వబోతుంది.

ఆ ఊపులో జన నాయగన్ చిత్రాన్ని విడుదల చేస్తే, ఓపెనింగ్స్ వేరే లెవెల్ లో ఉంటుందని , ఇప్పుడు తప్ప, ఇంకెప్పుడు విడుదల చేసినా , ఆ చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం మొత్తం ఆన్లైన్ లో లీక్ అయిపోయిన సంగతి తెలిసిందే. అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల సంఖ్యలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆన్లైన్ లో వీక్షించేశారు. కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తప్ప, లాంగ్ రన్ రావడం అసాధ్యమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper