Jordar Sujatha: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ కి భార్య జోర్దార్ సుజాత దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దెబ్బకు బిత్తరపోయిన రాకేష్ నోరువెళ్ళబెట్టాడు. అసలు ఏం జరిగిందో? మనం ఇప్పుడు ఈ స్టోరీ లో తెలుసుకుందాం. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ గుర్తింపు తెచ్చుకుంది సుజాత. అనంతరం బిగ్ బాస్ సీజన్ 4లో పార్టిసిపేట్ చేసి మంచి క్రేజ్ రాబట్టింది. అనంతరం జబర్దస్త్ కామెడీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. రాకింగ్ రాకేష్ టీం లో ఎక్కువగా స్కిట్స్ చేస్తుండేది సుజాత.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఏడాది రాకేష్ – సుజాత పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క బుల్లితెర షో లు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఈ జంట. తమకు సంబంధించిన వీడియోలు, మినీ వ్లాగ్స్ సదరు ఛానల్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ షార్ట్ వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోలో సుజాత, రాకేష్ ఓ చిన్న వివాదం జరిగింది. ఎండాకాలం కదా దుబాయ్ కి వెళ్దామా అని సుజాత భర్తను అడుగుతుంది. దానికి పక్కనే ఉన్న కేబుల్ బ్రిడ్జి కి పోదాం అని అంటాడు రాకేష్. కనీసం ప్యారిస్ అయినా పోదామా అని అంటే .. షాపింగ్ మాల్ కి పోదాం అని చెప్తాడు. దీంతో విసుగు చెందిన సుజాత పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాకేష్ తల నొప్పిగా ఉంది కాఫీ తీసుకురావా అని సుజాతను అడుగుతాడు.
దీంతో కోపంతో మండిపోతున్న సుజాత… పక్కనే కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్లి తాగండి అంటూ షాక్ ఇచ్చింది. దీంతో రాకేష్ కి ఏమనాలో తెలియక చూస్తూ ఉండిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా సుజాత ఇటీవల సేవ్ ది టైగర్స్ 2 కీలక రోల్ చేసింది. సుజాత నటనకు ప్రశంసలు దక్కాయి. సేవ్ ది టైగర్స్ 2 సైతం హిట్ టాక్ తెచ్చుకుంది.