Jabardasth Lady Comedian: జబర్దస్త్ లేడీ కమెడియన్ గర్భం దాల్చినట్లు సమాచారం అందుతుంది. దాంతో అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జోర్దార్ వార్తలతో జోర్దార్ సుజాతగా పాప్యులర్ అయ్యింది సుజాత. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఆమె పాల్గొన్నారు. అయితే పెద్దగా రాణించలేదు. 5వ వారమే సుజాత ఎలిమినేట్ అయ్యింది. హోస్ట్ నాగార్జునను ఈమె బిట్టూ అని పిలిచేది. ఆ సీజన్ విన్నర్ గా అభిజీత్ టైటిల్ అందుకున్నాడు. అనంతరం సుజాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
రాకింగ్ రాకేష్ టీమ్ లో సుజాత స్కిట్స్ చేస్తుంది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ ప్రేమలో పడింది. వీరిద్దరూ తమ ప్రేమను జబర్దస్త్ వేదికగా ప్రకటించారు. రాకింగ్ రాకేష్ సుజాతకు ప్రపోజ్ చేశాడు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే సుజాత రాకింగ్ రాకేష్ ఇంట్లో ఉండేది. సుజాత విషయంలో రాకేష్ తల్లి సంతోషం వ్యక్తం చేసింది.
అసలు రాకేష్ వివాహం చేసుకోకూడదు అనుకున్నాడట. రాకేష్ తమ్ముడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. రాకేష్ మాత్రం పెళ్లి చేసుకోకపోవంతో తల్లి చాలా ఆవేదన చెందేవారట. చుట్టాలు పక్కాలు రాకేష్ పెళ్లి గురించి అడుగుతుంటే బాధపడేవారట. రాకేష్ ని పెళ్ళికి ఒప్పించిన సుజాతకు అతని తల్లి అభినందించింది. వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. కాగా త్వరగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు ఈ జంట. ప్రస్తుతం సుజాత గర్భవతి అట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం జబర్దస్త్ షోలో జోర్దార్ సుజాత కొనసాగుతుంది. భర్త రాకింగ్ రాకేష్ టీమ్ లోనే ఆమె స్కిట్స్ చేస్తున్నారు. మరోవైపు నటిగా ఆఫర్స్ దక్కించుకుంటుంది. తెలుగు సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో సుజాత కీలక రోల్ చేసింది. ప్రియదర్శి భార్య పాత్రలో నవ్వులు పూయిస్తుంది. సేవ్ ది టైగర్స్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కాగా సీజన్ 2 సైతం విడుదలైంది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మరింత ఆదరణ దక్కించుకుంటుంది.
View this post on Instagram