https://oktelugu.com/

Vaishnavi Chaitanya: స్టార్ హీరోతో ‘బేబీ’ రోమాన్స్.. తట్టుకోలేమంతే

ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రంలో వైష్ణవి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 11, 2023 / 12:49 PM IST

    Vaishnavi Chaitanya

    Follow us on

    Vaishnavi Chaitanya: ‘ బేబీ’ సినిమా.. చిన్న సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఎంత సంచలనంగా నిలిచిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రంలో వైష్ణవి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. యూట్యూబర్ గా రాణించిన వైష్ణవి వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అయితే తొలిసారి ‘బేబీ ’ సినిమాలో హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బేబీ సినిమా సక్సెస్ అందుకున్న నేపథ్యంలో వైష్ణవికీ భారీ ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు అవకాశాలు రావడం లేదని తెలుస్తోంది.

    తాజాగా బేబీ సినిమా డైరెక్టర్ సాయి మరోసారి వైష్ణవికి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అది కూడా స్టార్ హీరో రామ్ పొతినేని సినిమాలోనని సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పొతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీలో వైష్ణవిని రెండో హీరోయిన్ గా తీసుకుందామని చిత్రబృందం భావించిందంట.. కానీ లాస్ట్ మినిట్ లో కాదనుకుని ఆమె స్థానంలో మరో కథనాయకను తీసుకున్నారని తెలుస్తోంది. అయితే వైష్ణవితో ఐటమ్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ ఆఫర్ కు వైష్ణవి చైతన్య సైతం ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ పొతినేనితో వైష్ణవి ఐటెం సాంగ్ అంటే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా చిత్రబృందం కానీ, వైష్ణవి కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.