Dunki: బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘ డంకీ’. విడుదలకు సిద్ధమైన ఈ మూవీపై ప్రేక్షకులు, అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సినిమాకు చెందిన పాటలు, టీజర్, ట్రైలర్ డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3, డ్రాప్ 4 గా విడుదల అయ్యాయి. తాజాగా డ్రాప్ 5 రిలీజ్ కోసం మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
మరోవైపు డంకీ సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానులను టెన్షన్ కు గురి చేస్తుంది..సినిమా రిలీజ్ కు ఇంకా కొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇంకా షూటింగ్ జరుపుకుంటుందంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ తాజా వార్తతో ప్రేక్షకులు అభిమానులు టెన్షన్ పడుతున్నారట.
డంకీ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ నంబర్ చిత్రీకరణ ఇటీవల అబుదాబిలో జరిగిన సంగతి తెలిసిందే. తరువాత యూఏఈకి వెళ్లిన షారూఖ్ అక్కడ చిత్ర బృందాన్ని కలిశారని సమాచారం. ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు స్పెషల్ సాంగ్ ను షూట్ చేశారని తెలుస్తోంది. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా ఇంకా చిత్రీకరణ జరుపుకోవడం అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పఠాన్, జవాన్ చిత్రాలు భారీ విజయాలను అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం డంకీ చిత్రంపై అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచాలు పెట్టుకోగా ఎలాంటి ఫలితాలను విడదుల చేస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షారూఖ్ ఖాన్ కథనాయకుడిగా నటించిన డంకీలో తాప్సీ, విక్కీ కౌశల్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలను పోషించారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లిన ఫ్రెండ్స్ కథగా డంకీ నిర్మితమైందని సమాచారం. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదలకానుందన్న సంగతి తెలిసిందే.