Ustaad Bhagat Singh movie hit or flop: మరో 23 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. పవన్ సినిమా విడుదల అంటే ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు నెల రోజుల ముందే వేరే లెవెల్ హైప్ ఉంటుంది. కానీ ఈ సినిమా పై ఎందుకో ఇప్పటి వరకు ఆ స్థాయి హైప్ ఏర్పడలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ ‘ ఎంతటి హైప్ తో విడుదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సినిమాకి ఓజీ కి ఉన్నంత హైప్ లో పావు శాతం కూడా లేదు. ఈ కాలం లో హైప్ లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఓపెనింగ్స్ రావడం అసాధ్యం. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి కూడా ఓపెనింగ్స్ ఈసారి భారీ గా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది .
‘ఓజీ’ చిత్రానికి మొదటి రోజున 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కనీసం మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ అయినా వస్తుందా అంటే , అభిమానులు కూడా బలమైన నమ్మకం తో చెప్పలేని పరిస్థితి. ఇది కాసేపు పక్కన పెడితే , ఈ సినిమాకు చాలా సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదురుకొని కమర్షియల్ గా హిట్ అయితే అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే , అది డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. ఇతను బాగా అవుట్ డేటెడ్ అయిపోయాడు అని , ఆయన గత చిత్రం ‘ మిస్టర్ బచ్చన్’ ని చూసి జనాలు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అందుకే ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువకి చేశారు. జనాల నమ్మకానికి తగ్గట్టుగా ‘మెడ ముట్టుకుంటే , తొడగొట్టినట్టే ‘ లాంటి నాసిరకమైన సాంగ్స్ పెట్టడం తో అభిమానులు సైతం ఈ సినిమాపై నమ్మకాలు వదిలేసుకున్నారు.
Also Read: స్కూల్ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. పెళ్లి కానుక అదుర్స్!
ఇక ఈ చిత్రానికి మరో పెద్ద సవాల్, రీమేక్ అనే నెగిటివిటీ ని దాటడం. మొదటి నుండి ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ అయిన ‘తేరి’ కి రీమేక్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. హరీష్ శంకర్ సైతం అందులో ఎలాంటి నిజం లేదని చెప్పినప్పటికీ జనాలు నమ్మడం లేదు. ఈ పాన్ ఇండియన్ యుగం లో రీమేక్ సినిమాలను జనాలు ఎలా తొక్కేస్తున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమాని కూడా జనాలు అలా తొక్కుతారేమో అనే భయం ఉంది. అదే విధంగా ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు ‘ధురంధర్ 2 ‘, ‘టాక్సిక్ ‘ లాంటి పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి, ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ విడుదలైన రెండు రోజులకు IPL సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ ఎదురుకొని ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం అద్భుతం అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.