Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh movie hit or flop: ఇన్ని అడ్డంకులను ఎదురుకొని 'ఉస్తాద్ భగత్...

Ustaad Bhagat Singh movie hit or flop: ఇన్ని అడ్డంకులను ఎదురుకొని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్ అవ్వడం అసాధ్యమేనా?

Ustaad Bhagat Singh movie hit or flop: మరో 23 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. పవన్ సినిమా విడుదల అంటే ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు నెల రోజుల ముందే వేరే లెవెల్ హైప్ ఉంటుంది. కానీ ఈ సినిమా పై ఎందుకో ఇప్పటి వరకు […]

Ustaad Bhagat Singh movie hit or flop: మరో 23 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. పవన్ సినిమా విడుదల అంటే ఆ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు నెల రోజుల ముందే వేరే లెవెల్ హైప్ ఉంటుంది. కానీ ఈ సినిమా పై ఎందుకో ఇప్పటి వరకు ఆ స్థాయి హైప్ ఏర్పడలేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ ‘ ఎంతటి హైప్ తో విడుదలైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ సినిమాకి ఓజీ కి ఉన్నంత హైప్ లో పావు శాతం కూడా లేదు. ఈ కాలం లో హైప్ లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఓపెనింగ్స్ రావడం అసాధ్యం. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ కి కూడా ఓపెనింగ్స్ ఈసారి భారీ గా ఉండే అవకాశం లేదని తెలుస్తోంది .

‘ఓజీ’ చిత్రానికి మొదటి రోజున 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కనీసం మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ అయినా వస్తుందా అంటే , అభిమానులు కూడా బలమైన నమ్మకం తో చెప్పలేని పరిస్థితి. ఇది కాసేపు పక్కన పెడితే , ఈ సినిమాకు చాలా సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదురుకొని కమర్షియల్ గా హిట్ అయితే అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే , అది డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రమే. ఇతను బాగా అవుట్ డేటెడ్ అయిపోయాడు అని , ఆయన గత చిత్రం ‘ మిస్టర్ బచ్చన్’ ని చూసి జనాలు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అందుకే ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువకి చేశారు. జనాల నమ్మకానికి తగ్గట్టుగా ‘మెడ ముట్టుకుంటే , తొడగొట్టినట్టే ‘ లాంటి నాసిరకమైన సాంగ్స్ పెట్టడం తో అభిమానులు సైతం ఈ సినిమాపై నమ్మకాలు వదిలేసుకున్నారు.

Also Read: స్కూల్ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. పెళ్లి కానుక అదుర్స్!

ఇక ఈ చిత్రానికి మరో పెద్ద సవాల్, రీమేక్ అనే నెగిటివిటీ ని దాటడం. మొదటి నుండి ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ అయిన ‘తేరి’ కి రీమేక్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. హరీష్ శంకర్ సైతం అందులో ఎలాంటి నిజం లేదని చెప్పినప్పటికీ జనాలు నమ్మడం లేదు. ఈ పాన్ ఇండియన్ యుగం లో రీమేక్ సినిమాలను జనాలు ఎలా తొక్కేస్తున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సినిమాని కూడా జనాలు అలా తొక్కుతారేమో అనే భయం ఉంది. అదే విధంగా ఈ సినిమా విడుదలకు వారం రోజుల ముందు ‘ధురంధర్ 2 ‘, ‘టాక్సిక్ ‘ లాంటి పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి, ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ విడుదలైన రెండు రోజులకు IPL సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ ఎదురుకొని ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం అద్భుతం అనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper