Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda bumper offer for students: స్కూల్ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.....

Vijay Deverakonda bumper offer for students: స్కూల్ విద్యార్థులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్.. పెళ్లి కానుక అదుర్స్!

Vijay Deverakonda bumper offer for students: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారో మన కళ్లారా చూశాం . సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ జంటకు లక్షల సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేశారు. తమని ఇంత వారిని చేసి, ఈ స్థాయిలో ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు తమ వైపు […]

Vijay Deverakonda bumper offer for students: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట ఎంత గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారో మన కళ్లారా చూశాం . సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలే దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ జంటకు లక్షల సంఖ్యలో శుభాకాంక్షలు తెలియజేశారు. తమని ఇంత వారిని చేసి, ఈ స్థాయిలో ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు తమ వైపు నుండి ప్రేమతో ఈ నెల 1న దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదానాలు , స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు తలపెట్టారు. వీళ్ళు చూపించిన ఈ ప్రేమపై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమం తర్వాత విజయ్ దేవరకొండ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు. తన సొంత ఊరికి ఆయన సేవలు చెయ్యాలని బలంగా నిర్ణయం తీసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఆయన తన కుటుంబం తో కలిసి నాగర్ కర్నూలు జిల్లాలోని బలమూరు మండలంలో ఉన్నటువంటి తుమ్మన్ పేట గ్రామానికి వెళ్లారు. ఈ గ్రామమే విజయ్ సొంతూరు అట. పెళ్ళైన తర్వాత తొలిసారి తన కుటుంబ సభ్యులతో ఈ గ్రామానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ కి గ్రామా ప్రజలు ఘన స్వగతం పలికారు. గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే తన స్వగృహం లో సత్యనారాయణ వ్రతాన్ని జరిపించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత స్థానిక ప్రజలందరికీ విందు భోజనం ఏర్పాటు చేసాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘నాకు జన్మనిచ్చిన ఈ ఊరితో విడదీయని ప్రేమానుబంధాలు ఉన్నాయి. నా మొదటి పుట్టినరోజుని ఇక్కడే జరుపుకున్నాను అని మా అమ్మ చెప్పింది. మా నాన్న కోరిక మేరకు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను. సొంత గ్రామంలో నా పెళ్లి వేడుకలు మీ మధ్య ఇలా జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మా జంటకు ఆశీస్సులు అందించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.

Also Read: చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేయాలనుకున్న రజినీకాంత్… మోహన్ బాబు ఏం చెప్పాడంటే.?

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మన గ్రామానికి మంచి పనులు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్తాను. ఈ విద్యా సంవత్సరం లో తుమ్మన్ పేట ప్రభుత్వ పాఠశాలలో 9, 10 వ తరగతుల్లో మంచి మార్కులను సొంతం చేసుకున్న ఇద్దరు విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వాలని అనుకుంటున్నాను. వచ్చే ఏడాది అచ్చం పేట డివిజన్ పరిధిలోని 44 పాఠశాలల్లో దీనిని అమలు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ మంచి నిర్ణయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper