Homeఎంటర్టైన్మెంట్Niharika Konidela: నిహారిక వేసుకున్న టాటూ వెనుక ఇంత అర్థం ఉందా?

Niharika Konidela: నిహారిక వేసుకున్న టాటూ వెనుక ఇంత అర్థం ఉందా?

రీసెంట్ గా నిహారిక ప్రొడ్యూసర్ గా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఈ పూజా కార్యక్రమంలో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు పూజలో పాల్గొని పూజను విజయవంతం చేశారు.

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. నిహారిక ఏంటి ఇలా చేసిందంటూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే నిహారిక ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ను పక్కన పెట్టి ప్రస్తుతం కెరీర్ పరంగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉంది. సినిమా రంగంలో నటనతో పాటు ఇంపార్టెంట్ రోల్స్ చాలా ఉన్నాయని తెలిసిందే. అయితే రీసెంట్ గా నిహారిక ప్రొడ్యూసర్ గా అవతారమెత్తి సినిమా రంగంలో దూసుకుపోవాలని చూస్తుంది. అయితే ఈ సందర్భంగా ఆమె టాటూ ఒకటి వైరల్ గా మారింది.. అదేంటంటే..

రీసెంట్ గా నిహారిక ప్రొడ్యూసర్ గా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ అమ్మడు. ఇక ఈ పూజా కార్యక్రమంలో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు పూజలో పాల్గొని పూజను విజయవంతం చేశారు. అయితే నిహారిక ప్రొడ్యూసర్ గా వ్యవహరించే సినిమాకు చాలా మంది కొత్తవారిని తీసుకున్నారట. ఇక ఈ పూజలో నిహారిక సాంప్రదాయ బద్దంగా చీర కట్టుకొని కనిపించింది. ఇక చీరలో ఉన్న నిహారిక ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది.

నిహారిక వీపు మీద టాటూ వేయించుకుంది. ఈ టాటూ ని ఎందుకు వేయించుకుంది? అసలు దీని అర్థం ఏంటి? అని తెగ సెర్చ్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు. ఇక నిహారిక వీపు మీద ఉన్న టాటూ పక్షికి సంబంధించింది. ఇక ఈ టాటూను విడాకుల తర్వాత వేయించుకుందట నిహారిక. నిహారిక ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లయ్యాక తన లైఫ్ మొత్తం మారిపోయిందని టాక్. అత్తింటి వారు పెట్టే కండీషన్స్ ని తట్టుకోలేకపోయిందట. దాంతో జొన్నలగడ్డ తో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది అమ్మడు.

విడాకుల తర్వాత నిహారిక కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినప్పటికీ మళ్లీ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వల్ల మామూలు స్థితికి వచ్చేసింది. విడాకుల తర్వాత నిహారిక తన వీపు పై పక్షి టాటూ వేయించుకోవడానికి కారణం పెళ్లయ్యాక తన ఫ్రీడమ్ పోయిందని.. పంజరంలో చిక్కిన పక్షి లాగా తన లైఫ్ మారిపోయిందని, కానీ ఎప్పుడైతే నిహారిక విడాకులు వచ్చాయో ఆ తర్వాత ఫ్రీ బర్డ్ లాగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుందట. అంటే ఆ సింబల్ ను ఇలా టాటూ మాదిరి వేయించుకుందని తెలుస్తోంది. మరి నిహారిక వేసుకున్న ఈ టాటూ వెనుక అర్థం ఏంటో మాత్రం తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే..

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper