https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పోస్టులు పెట్టేది ఆ హీరోనా..? ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!

ఉదాహరణకి 'సలార్' చిత్రం లో ప్రభాస్ కి ప్రాణ స్నేహితుడిగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మాట్లాడుకోవాలి. 'సలార్' చిత్రానికి ముందు ఈయనకి ప్రభాస్ తో పెద్దగా పరిచయం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : February 4, 2025 / 04:58 PM IST
    Prabhas

    Prabhas

    Follow us on

    Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఆయన సాధించిన విజయాలు, చూస్తూ ఉండగానే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు, అంత పెద్ద స్టార్ అయ్యాక కూడా ఇసుమంత గర్వం కూడా చూపించకుండా చాలా వినయం తో తన తోటి హీరోలకు ఆదర్శంగా నిలబడడం వంటివి చాలానే ఉన్నాయి. హీరో గా కాకుండా మనిషిగా ప్రభాస్ ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తనకు పోటీని ఇచ్చే హీరోలతో ఎంత పెద్ద హీరో అయిన బెట్టు చూపిస్తారు. కానీ ప్రభాస్ కి అలాంటివి ఏమి లేవు. తనతో సరిసమానమైన ఇమేజ్ ఉన్న రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారితో చాలా మంచి స్నేహాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంటాడు. అంతే కాదు ఆయనతో పని చేసే నటీనటులు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతుంటారు.

    ఉదాహరణకి ‘సలార్’ చిత్రం లో ప్రభాస్ కి ప్రాణ స్నేహితుడిగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి మాట్లాడుకోవాలి. ‘సలార్’ చిత్రానికి ముందు ఈయనకి ప్రభాస్ తో పెద్దగా పరిచయం లేదు. కానీ ‘సలార్’ తర్వాత మాత్రం ఆయనకు బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయాడు. అంతే కాదు త్వరలోనే ప్రభాస్ ని హీరోగా పెట్టి, ఈయన దర్శకత్వం లో ఒక సినిమా కూడా చేయనున్నాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ అసలు తనకి ఉన్న స్టార్ డమ్ ని అసలు పట్టించుకోడు. సోషల్ మీడియా లో జరిగే వాటిని అసలు చూడడు. తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ ని కూడా ప్రభాస్ ఉపయోగించడు..ఆయనకీ బదులుగా ఆయన టీం పోస్టులు పెడుతుంటాది’.

    ‘సలార్ టీజర్ సమయంలో అయితే నేనే ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పోస్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రభాస్ చేస్తున్న సినిమాలలో షూటింగ్ చివరి దశలో ఉంటూ, రిలీజ్ కి అతి దగ్గర్లో ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘రాజా సాబ్’ మాత్రమే అని చెప్పొచ్చు. అన్ని అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేసేవారు మేకర్స్. కానీ ప్రభాస్ కాళ్లకు గాయాలు అవ్వడంతో ఆయన గత కొంత కాలం నుండి షూటింగ్ కి దూరంగా ఉంటూ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి రాగానే ఆయన మళ్ళీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ నటిస్తున్నారు.