Sharwanand: ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పాత సినిమాల పాటలను, టైటిల్స్ ని తమ సినిమాల కోసం తెగ వాడేస్తున్నారు. ఆయన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి టైటిల్స్ ని నేటి తరం యంగ్ హీరోలు వాడేశారు. తొలిప్రేమ టైటిల్ ని వరుణ్ తేజ్ వాడగా, తమ్ముడు టైటిల్ ని నితిన్, అదే విధంగా ఖుషి టైటిల్ ని విజయ్ దేవరకొండ ఉపయోగించారు. కేవలం టైటిల్స్ ని మాత్రమే కాదు, ఆయన పాటల్లో వచ్చే కొన్ని లిరిక్స్ ని కూడా తెగ వాడేసుకున్నారు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘కెవ్వు కేక’ టైటిల్స్ తో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా శర్వానంద్ కూడా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పై కన్నేశాడు. ప్రస్తుతం ఆయన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రానికి ‘మా నాన్న సూపర్ హీరో’ ఫేమ్ అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో శర్వానంద్ కి తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘జానీ’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారట. ‘ఖుషి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో కనివిని ఎరుగని రేంజ్ హైప్ తో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమాకి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులతో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంది. అలాంటి సినిమా టైటిల్ ని వాడడం పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు. ప్రతీ హీరోకి మా హీరో టైటిల్ మాత్రమే కనిపిస్తుందా, వేరే టైటిల్స్ దొరకడం లేదా అంటూ మండిపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషిస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ కి రెండు కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇంతకాలం కేవలం హీరో గా మాత్రమే కొనసాగుతూ వచ్చిన ఆయన, ఇక నుండి క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి ముందు నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంలో రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు కానీ, రాజశేఖర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆయన తనని తానూ పూర్తి స్థాయి క్యారక్టర్ రోల్స్ చేసేందుకు సిద్ధం చేసుకున్నాడు. కథ నచ్చితే నెగటివ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం అంటూ ఆయన చెప్పుకొస్తున్నడు. చూడాలి ఆయన సరికొత్త ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.