spot_img
Homeఎంటర్టైన్మెంట్Actor Sai Kiran: భార్యకు విడాకులు.. ‘వదిన’ మెడలో తాళి.. అది కూడా 46 ఏళ్లకు.....

Actor Sai Kiran: భార్యకు విడాకులు.. ‘వదిన’ మెడలో తాళి.. అది కూడా 46 ఏళ్లకు.. ఈ హీరో లైఫ్ అంతా ట్విస్ట్ లే..!

Actor Sai Kiran: సెలబ్రెటీల వ్యక్తిగత జీవితం (అందరివీ కావు) చాలా వింతగా అనిపిస్తుంది. మేము ఆ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారన్న కనీసం ఆలోచించరేమో. పెళ్లి చేసుకోవడం విడాకులు ఇవ్వడం., మళ్లీ పెళ్లి, అది కూడా అలాగైతే మళ్లీ విడాకులు.. మళ్లీ పెళ్లి.. ఇదే కొనసాగుతోంది. మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న నటులు, మటీమణులు, బిజినెస్ మ్యాన్లు లేకపోలేదు. ఇక వీరి వరుసలు కూడా చాలా వింతగా అనిపిస్తాయి. భార్యకు విడాకులు ఇచ్చి సొంత ఇంట్లో నుంచి లేదంటే భార్య కుటుంబంలో నుంచే మరో అమ్మాయికి తాళి కడతారు. ఇలాంటిదే ఒక నటుడు లైఫ్ లో జరిగింది. భార్యకు విడాకులిచ్చి వరుసకు వదిన అయ్యే నటి మెడలో తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు. ఆ నటుడు ఎవరో కాదు సాయి కిరణ్. అవును మీరు విన్నతి నిజమే… సాయి కిరణ్ గురించి సీరియల్స్ చూస్తున్న యంగ్ జనరేషన్ కు సినిమాలు చూసిన కొంచెం ఓల్డ్ జనరేషన్ కు తెలుసు. 2000లో ‘నువ్వే కావాలి’లో హీరోగా తరుణ్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో.. సపోర్టింగ్ యాక్టరైన సాయి కిరణ్ కు కూడా అంతే గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ‘అనగనగా ఆకాశం ఉంది’ అనే పాట ఎక్కడ వినిపించినా సాయి కిరణే గుర్తొస్తాడు. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించాడు. ఇంకా సీరియల్స్ లో కూడా కనిపిస్తున్నాడు.

నువ్వే కావాలి తర్వాత అవకాశాలు బాగానే వచ్చినా.. పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. డార్లింగ్ డార్లింగ్, జగపతి, కానీ, గోపీ ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ కావడంతో సాయి కిరణ్ కెరీర్ బ్యాక్ కు వెళ్లింది. దీంతో తనకు సినిమా ఆఫర్స్ రావడం తగ్గాయి. ఇదే సమయంలో సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో అటు వైపునకు వెళ్లారు. సీరియల్స్‌లో కొంత కాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించారు. ఏ ఛానల్‌ సీరియల్ అయినా సాయి కిరణ్ ఉండాల్సిందే అన్నంగా పాపులర్ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సీరియల్స్ లో కూడా నటించాడు.

2010లో వైష్ణవి అనే అమ్మాయిని సాయి కిరణ్ వివాహం చేసుకున్నాడు. వీరికి పాప ఉంది. గత కొంతకాలంగా వీరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లి గురించి ప్రకటన చేశాడు. ఈ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నది ‘వదిన’తో కావడం విశేషం. తనతో పాటు ‘కోయిలమ్మ’ సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం అయ్యింది. ఈ సీరియల్‌లో స్రవంతి సాయి కిరణ్‌కు వదినగా నటించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper