Indian 2-Game Changer: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతున్న ఏకైక దర్శకుడు శంకర్… అయితే గత రెండు,మూడు సినిమాలతో ఆయన కొద్దిగా డీలాపడినప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న “గేమ్ చేంజర్” అలాగే కమలహాసన్ తో చేస్తున్న “ఇండియన్ 2 ” సినిమాలతో మరోసారి తన సత్తాని చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే గేమ్ చేంజర్,ఇండియన్ 2 సినిమాల టీజర్లను ఎప్పుడు వదులుతారు అంటూ రామ్ చరణ్, కమల్ హాసన్ అభిమానులు శంకర్ కి విపరీతమైన మెసేజ్ లు పెడుతున్నారట. నిజానికి గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న కూడా ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ ను మాత్రమే వదిలారు.ఇక ఇప్పుడు టీజర్ కోసం ప్రేక్షకులందరూ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా పుష్ప 2 సినిమా టీజర్ తో అల్లు అర్జున్ ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాడు.
ఇక దాంతో రామ్ చరణ్ అభిమానులు కూడా వాళ్ల అభిమాన హీరోని తొందరగా స్క్రీన్ మీద చూడాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇండియన్ 2 పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక ఇదంతా చూస్తుంటే శంకర్ అసలు ఏం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను సెట్స్ మీద పెట్టుకొని ఇంత స్లో గా వర్క్ చేస్తున్నాడేంటి అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా ఆయన సరైన సమయానికి వదలడం లేదు. దానివల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఉండే బజ్ అయితే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ సినిమాల టీజర్లు, ట్రైలర్లతో అదరగొడుతుంటే ఇక ఈ సినిమాల టీజర్, ట్రైలర్ కోసం వెయిట్ చేసి ప్రేక్షకులు అలసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇస్తే బాగుంటుందని అభిమానులు, ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు…