Hrithik Roshan Second Marriage: హృతిక్ రెండో పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన రానుంది. హృతిక్ రోషన్ సుసాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తరువాత పదేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ హృతిక్ రోషన్, సుసాన్ కు విడాకులు ఇచ్చాడు, భరణంగా దాదాపు 400 కోట్ల రూపాయాలను డిమాండ్ చేసిందట సుసాన్. చివరకు ఆమెకు రూ.380 కోట్లను భరణంగా ఇచ్చినట్లు టాక్.

భార్య సుసాన్ కి విడాకులు ఇచ్చి చాలా ఏళ్ళు అయింది. మరోపక్క సుసాన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్లో ఉంది. ఆమె తరుచుగా కొత్త బాయ్ ఫ్రెండ్ ని హగ్ చేసుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. ఇవ్వన్నీ చూసి చూసి విసిగిపోయిన హృతిక్ రోషన్, ఇక తాను కూడా కొత్త బంధం వెతుక్కోవాలి అని డిసైడ్ అయ్యాడు. కరెక్ట్ గా అప్పుడే పరిచయం అయ్యింది నటి సభా ఆజాద్.

ఈ భామతో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నాడు హృతిక్. గత కొంత కాలంగా వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఆ మధ్య ముంబై విమానాశ్రయంలో కూడా కనిపించారు. పైగా ఒకరి చేతిలో ఒకరు ప్రేమగా చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. పబ్లిక్ గానే ఒకరి పై ఒకరు చూపించుకున్న ఆప్యాయతను బట్టి ఈ జంట ఏ స్థాయిలో ప్రేమలో మునిగి తేలుతుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తం మీద, ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అని వినిపిస్తున్న పుకార్లు ఇప్పుడు నిజాలు అయ్యాయి. వచ్చే నెలలో ఈ జంట ఒక్కటి కాబోతుంది. ఏది ఏమైనా హృతిక్ రోషన్ ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. నిజంగా హృతిక్ జీవితం నమ్మశక్యం కానిది. హృతిక్ రోషన్ కి చిన్నతనంలో ఎక్కువగా నత్తి ఉండేది. ఆ నత్తి బాధతో అతను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు.
అలాగే అతనికి ఇంకా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే ఏం ? పుట్టుకతో వచ్చిన ఆ లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్.