Hrithik Roshan
Hrithik Roshan : పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే హీరోలలో ఒకరు హృతిక్ రోషన్(Hrithik Roshan). ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్(Rakesh Roshan) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన యూత్, మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది. అయితే హృతిక్ రోషన్ ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాల్సిందని, సినిమాలు ఆలస్యంగా చేస్తూ వస్తుండడం వల్ల ఆయన చాలా వెనుకపడ్డాడని అందరూ అంటుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియా లో హృతిక్ రోషన్ కి ఉన్నంత క్రేజ్ ఏ బాలీవుడ్ హీరోకి కూడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ని, క్రేజ్ ని సరిగా ఉపయోగించుకోవడం లేదు అనేదే ఆయన అభిమానుల నుండి వ్యక్తం అవుతున్న బాధాకరమైన విషయం.
Also Read : 500 మంది డాన్సర్స్ తో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సాంగ్..’నాటు నాటు’ ని మించిన స్టెప్పులతో ఫ్యాన్స్ కి పండగే!
ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో కలిసి ‘వార్ 2′(War 2 Movie) చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14 న విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఒక భారీ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారు. అయితే ‘వార్ 2’ తర్వాత హృతిక్ రోషన్ చేయబోతున్న సినిమా ఏమిటి అనే దానిపై నిన్న మొన్నటి వరకు అభిమానులకు క్లారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ చిత్రం తర్వాత ఆయన ‘క్రిష్ 4′(Krrish 4) చేయబోతున్నాడట. ఈ చిత్రానికి డైరెక్టర్ గా కూడా హృతిక్ రోషన్ వ్యవహరిస్తాడని తెలుస్తుంది. ఇది ఆయన కెరీర్ లో మొట్టమొదటిసారి దర్శకత్వం వహించబోతున్న సినిమాగా చెప్పుకోవచ్చు. క్రిష్ సిరీస్ మొత్తానికి హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించాడు.
ఈ సిరీస్ నుండి వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ చిత్రాలు సంచలన విజయాలు గా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిష్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సిరీస్ ని కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు హృతిక్ రోషన్. క్రిష్ 4 స్క్రిప్ట్ ని హృతిక్ రోషన్ దాదాపుగా 5 ఏళ్ళ సమయం తీసుకొని డెవలప్ చేశాడట. ఆయన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రమిది. అందుకే దర్శకత్వం కూడా తానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. క్రిష్ సిరీస్ అంటే కచ్చితంగా ప్రియాంక చోప్రా నే హీరోయిన్ గా చేయాలి, కానీ ఆమె ప్రస్తుతం రాజమౌళి సినిమాకు లాక్ అయ్యింది. దీంతో ఇప్పుడు హృతిక్ రోషన్ ఏ హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.
Also Read : హృతిక్ రోషన్ కంటే అందంగా ఉన్న అతడి డూప్.. వైరల్ అవుతున్న వీడియో