Hrithik Roshan : అమ్మాయిల కలల రాకుమారుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అంతా హృతిక్ లాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కోయి మిల్ గయా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వార్ 2 అనే సినిమా చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేరింగ్ అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతుంది. ఐతే వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. హృతిక్ రోషన్ డూప్ కు సంబంధించిన వీడియో అది.
సాధారణంగా ఒక హీరో యాక్షన్ సన్నివేశాలు లేదా ఆ హీరో చేయలేనటు వంటి సీక్వెన్స్ లు సినిమాలో ఉంటే ఖచ్చితంగా దర్శక నిర్మాతలు వారికోసం ఒక డూప్ ని సృష్టిస్తూ ఉంటారు. అయితే ఈ డూప్ ల గురించి ఈమధ్య ఎక్కువగా వినిపిస్తుంది. బడా హీరోలు మినహా చిన్న హీరోల వరకు అందరికీ డూపులు ఉంటున్నారు. అలాగే ప్రస్తుతం హృతిక్ రోషన్ తన డూప్ తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హృతిక్ రోషన్ డూప్ అచ్చం అతడి లానే కాదు కాదు హృతిక్ ని కూడా మించిపోయేంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. పైకి యాక్షన్ సీన్స్ అన్నీ ఎలాంటి డూప్ లేకుండా మేమే చేశామని హీరోలు ఎంత చెప్పినా కచ్చితంగా బాడీ డబుల్ అవుతుంది.. స్టార్ డూప్ గా నటించే వాళ్లు మాత్రం బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు.
ఇది ఇలా ఉంటే వార్ 2 సెట్ లో హృతిక్ రోషన్ డూప్ చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. దూరం నుంచి చూస్తే ఎవరు హృతిక్ ఎవరు.. అందులో డూప్ ఎవరో కనిపెట్టలేనంత దగ్గరపోలికలతో ఉన్నారు. ఆ వ్యక్తి డ్రెస్, స్టైల్, లుక్ అన్నీ పర్ ఫ్రెక్ట్ గా మ్యాచ్ చేశారు. వార్ 2లో భారీ యాక్షన్ సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించినట్లు సమాచారం. గతేడాది ఫైటర్ సినిమాతో వచ్చిన హృతికో భారీ సక్సెస్ అందుకోలేకపోయాడు. దీంతో వార్ 2 తో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు.
#War2 shooting #HrithikRoshan’s body double isn’t just a lookalike—he carries the same aura and swag!#JrNTR – The storm is brewing, and the battlefield is about to witness an explosion of action! ⚡ pic.twitter.com/dv6ctWBJt2
— CHITRAMBHALARE (@chitrambhalareI) February 19, 2025