Peddhi , Jr. NTR
Peddhi and Jr. NTR : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram Charan), బుచ్చి బాబు(Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ కి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు కూడా రామ్ చరణ్ నుండి ఈ రేంజ్ మేక్ ఓవర్ ని ఊహించలేదు. ఇందులో రామ్ చరణ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అది స్పష్టంగా తెలిసొచ్చేలా డిజైన్ చేసారు మేకర్స్. అయితే ఈ సినిమా స్టోరీ ని ముందుగా రామ్ చరణ్ తో కాకుండా, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో చేద్దామని అనుకున్నారు. #RRR మూవీ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇదేనంటూ ప్రచారం కూడా జరిగింది.
Also Read : జూనియర్ ఎన్టీయార్ ఎందుకు ఆ పాత్రని రిజెక్ట్ చేశాడు…అది కనక చేసి ఉంటే ఆయన లెవల్ వేరే రేంజ్ లో ఉండేదా..?
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , ఈ ప్రాజెక్ట్ రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్ళిందంటూ సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళకు ఆ వార్తనే నిజమైంది. ఈ సినిమా నుండి ఎన్టీఆర్ తప్పుకోవడానికి ప్రధాన కారణం సుకుమార్ అట. బుచ్చి బాబు ఒక రోజు సుకుమార్ కి స్టోరీ మొత్తాన్ని వినిపించిన తర్వాత ఈ చిత్రం ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి బాగా సూట్ అవుతుందని, ఎన్టీఆర్ కి పూర్తి కథ న్యారేషన్ ఇవ్వకుండా ఉండుంటే, ఇక్కడితోనే వదిలేయ్, రామ్ చరణ్ కి న్యారేషన్ ఇవ్వు, ఈ కథకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు అని అన్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యింది. నిన్న చరణ్ లుక్ చూసిన తర్వాత సుకుమార్ ఎందుకు ఈ సినిమాని చరణ్ చేస్తే బాగుంటుంది అన్నాడో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
ఇకపోతే శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు కానీ, వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని మేకర్స్ రీసెంట్ గానే నిర్ణయించుకున్నారట. మార్చి 26 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో జాన్వీ కపూర్(Jhanvi Kapoor) హీరోయిన్ గా నటించగా, AR రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయనున్నారు. వాస్తవానికి నిన్ననే టీజర్ ని విడుదల చేయాలని అనుకున్నారు, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఉగాదికి టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీజర్ తోనే రామ్ చరణ్ కం బ్యాక్ వేరే లెవెల్ లో ఉండబోతుందని అందరికీ అర్థం అవుతుందట, ఆ రేంజ్ లో ఉందని టాక్
Also Read : ‘పెద్ది’ దెబ్బకు నేషనల్ మీడియా షేక్..ఫస్ట్ లుక్ కి ఊహించని రెస్పాన్స్!