Junior NTR-Hrithik Roshan: ఇండియా లో అద్భుతంగా డ్యాన్స్ వేయగల టాప్ 5 హీరోల జాబితా తీస్తే అందులో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పేర్లు కచ్చితంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అని చెప్పి పాటలు, ఫైట్స్ లేకపోతే ఎంత తప్పో, ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి సినిమా చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సాంగ్ క్రియేట్ చేయకపోవడం కూడా అంతే తప్పు. ఎట్టకేలకు అభిమానులు కోరుకున్నట్టుగానే వీళ్లిద్దరి మధ్య కళ్ళు చెదిరే డ్యాన్స్ నెంబర్ ఒకటి సిద్ధం చేశారట. ప్రీతమ్ సంగీతం సారథ్యంలో కంపోజ్ చేయబడిన ఈ పాటకు బోస్కో మార్టీస్ కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. సుమారుగా 500 కి పైగా డాన్సర్లు ఈ పాటలో కనిపించబోతున్నారట. యాష్ రాజ్ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్ లో ఈ సాంగ్ ని చిత్రీకరించబోతున్నారు. ఈ పాట ‘నాటు నాటు’ కి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read : వార్ 2′ విడుదల తేదీ పై సంచలన ప్రకటన చేసిన మూవీ టీం..ఇక అభిమానులకు పండగే!
‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంత తేలికగా మర్చిపోగలమా?, ఈ పాట ని కంపోజ్ చేసినందుకు కీరవాణి కి, రాసినందుకు చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. కానీ వాళ్లకు అలా ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్, రామ్ చరణ్(Global Star Ramcharan) కలిసి వేసిన డాన్స్ స్టెప్పులే. ఇప్పుడు ఎన్టీఆర్ మరో అద్భుతమైన డాన్సర్ తో కలిసి డ్యాన్స్ వేయబోతున్నాడంటే, కచ్చితంగా అంచనాలు ‘నాటు నాటు’ కి మించే ఉంటుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట తర్వాత ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం ఉంటుంది. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో అయాన్ ముఖర్జీ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.
అయితే ఈ చిత్రాన్ని ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఆగష్టు 14న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉందని, అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు లేవని వార్తలు వినిపించాయి కానీ, అందులో ఎలాంటి నిజం లేదని మేకర్స్ మీడియా కి ఒక సమాచారం అందచేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయిన హృతిక్ రోషన్ తో, సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరైన ఎన్టీఆర్ కలిసి సినిమా తీస్తే 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వస్తాయని, మన ఇండియన్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లే చిత్రం రాబోతుందని అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందా లేదా అనేది.
Also Read : వార్ 2′ విడుదల తేదీ పై సంచలన ప్రకటన చేసిన మూవీ టీం..ఇక అభిమానులకు పండగే!