Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో ఆడవాళ్ళ నుండి కచ్చితంగా టాప్ 5 లోకి వస్తుంది అని అనుకున్న వారిలో యష్మీ ఒకరు. ఈమె ఆడిన ఆట తీరుని చూసి అప్పట్లో అందరూ ఆడపులి అని పిలిచేవారు. మూడవ వారం ప్రభావతి టాస్క్ లో ఈమె బాగా హైలైట్ అయ్యింది. తనకు టాస్కులు ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా దుమ్ము దులిపేసేది. అలాంటి అమ్మాయి ఆట 5వ వారం నుండి గాడి తప్పింది. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అయితే పూర్తిగా నాశనం అయ్యింది. ఏదైతే నాకు ఒక డ్రీం వచ్చింది అని ఆమె చెప్పిందో, ఆ డ్రీం ఆమె బిగ్ బాస్ ఆట తీరుని సర్వ నాశనం చేసేసింది. ఫలితంగా ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. కచ్చితంగా టాప్ 10 లో ఇప్పటికీ ఈమె ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు.
విష్ణుప్రియ, ప్రేరణ కంటే హౌస్ లో ఉండేందుకు అర్హతలు ఉన్న అమ్మాయి. కానీ ఈ వారం నామినేషన్స్ లో ఒక సున్నితమైన అంశంలో ఆమె సరైన రీతిలో స్టాండ్ తీసుకొని ఉండుంటే, ఈరోజు ఆమె ఎలిమినేట్ అయ్యేది కాదు. ఏది ఏమైనా బిగ్ బాస్ షో కి బోలెడంత కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ మొత్తానికి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఆట ఎక్కడ చెడిపోయింది అంటే, నిఖిల్ ని ఎప్పుడైతే ప్రేమించిందో అప్పటి నుండి అన్నమాట. అతన్ని ఇష్టపడిన తర్వాత ఆమె తన కోసం గేమ్ ఆడడం మానేసి, కేవలం అతని కోసం మాత్రమే ఆడుతూ ఇన్ని రోజులు వచ్చింది. అతను కూడా తన మనసులోని మాటల్ని నిర్మొహమాటంగా ఆమెకి చెప్పేసి ఉండుంటే, ఆమె ఆట మీద ప్రభావం చూపేది కాదు. నిఖిల్ కి కూడా ఈమె అంటే ఇష్టం ఉంది కానీ, బయట పడడానికి భయపడుతున్నాడు అని కేవలం యష్మీ కి మాత్రమే కాదు, చూసే ఆడియన్స్ కి కూడా అనిపించింది.
అంతే కాకుండా ఈ వారం సోనియా, సీత వంటి వారు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి నిఖిల్ పై ఈమె విషయంలో దారుణమైన నిందలు వేసి వెళ్లారు. ఆ సమయంలో యష్మీ సరైన రీతిలో స్టాండ్ తీసుకొని ఉండుంటే, ఈరోజు వేరేలా ఉండేది. కానీ ఆమె తీసుకోలేదు. పక్క రోజు అతని కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడింది కానీ, జనాలు దానిని అంగీకరించలేకపోయారు. ఇవన్నీ పక్కన పెడితే యష్మీ ఎలిమినేట్ అవ్వడానికి మరో కారణం ఆమె చేసే ఫ్లిప్పింగ్స్. ఆమె కావాలని ఫ్లిప్ చేస్తుందని మనమంతా అనుకున్నాము కానీ, వాస్తవానికి అది నిజం కాదు. ఎందుకంటే ఈమె చేసే పనులను ఈమెనే మర్చిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ వారం ఆమె తన గురించి కూడా సరైన రీతిలో స్టాండ్ తీసుకోలేకపోయింది. ఇలా షోకి బోలెడంత కంటెంట్ ఇచ్చిన యష్మీ నేడు ఈ కారణాల చేత ఎలిమినేట్ అయ్యింది. బయటకి వచ్చిన తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Horoscope today transit of venus on these signs whatever they think will happen 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com