Baahubali 10 years later: బాహుబలి సినిమా నిన్నటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పదవ బర్త్ డే చేసుకుంది ఈ సినిమా. ఈ సందర్బం గా చిత్ర యూనిట్ చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ వంటి ప్రముఖులు కూడా ఈ పార్టీకి హాజరు అయ్యారు. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పార్ట్ 1 వచ్చిన తర్వాత టాలీవుడ్ రేంజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రికి రాత్రే మన టాలీవుడ్ ఖ్యాతీ దేశ నలుమూలలా పాకింది.
Also Read: నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ లీక్..ఈ రేంజ్ లో ఉన్నాడేంటి బాబోయ్!
ఈ సినిమాలోని ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా స్టార్లుగా పేరు కూడా వచ్చేసింది. అయితే పార్ట్ 2 కూడా ఓ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది. పార్ట్ 1 రేంజ్ ను మించి పోయింది పార్ట్ 2. ది బాహుబలి బిగినింగ్, ఎండింగ్ లు సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఇంతకీ అవేంటి అనుకుంటున్నారా? పది సంవత్సరాలు అయినా సరే ఈ మిస్టెక్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ ఓ సారి మనం తెలుసుకుందామా?
ఒక గుంపులో ఉండే పిల్లవాడికి అసలు స్టోరీ తెలియక ఏం చేస్తున్నాడో అర్థం కాదు. జై కొట్టమంటే కొడుతున్నట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక సీన్ లో కట్టప్ప బయటే ఉంటాడు. కానీ దాని వెంటనే వచ్చే సీన్ లో మాత్రం కట్టప్ప లోపల నుంచి వస్తాడు. మహారాణి కాలికి గాయం అవుతుంది. కానీ చెక్ చేసేటప్పుడు ఆ కాలికి గాయమే ఉండదు. ఇక్కడ పర్ఫెక్ట్ గా చూయించలేదు. అయితే సడెన్ గా ఒక నదిలోకి వెళ్లి వాటర్ తాగుతుంటాడు బాహుబలి. అప్పటి వరకు నీరు నార్మల్ గా ఉంటుంది. కానీ సడెన్ గా బాహుబలి వెళ్లి వాటర్ తాగుతుంటే సడెన్ గా శవాలు తేలుతాయి. అన్నీ ఒకేసారి పైకి తేలుతాయి.
Also Read: కూలీ’ హైప్ ని అమాంతం పెంచేసిన పూజా హెగ్డే..యూట్యూబ్ ని ఊపేస్తున్న ‘మౌనిక’ పాట!
ఒక ఫైటింగ్ లో బాహుబలి ఒక వ్యక్తిని చంపడానికి దూకుతాడు. ఆ దూకే సమయంలో చేతిలో గొడ్డలి ఉండదు. కానీ చంపేటప్పుడు మాత్రం సడెన్ గా గొడ్డలి వస్తుంది. ఇంతకీ దూకేటప్పుడు లేని గొడ్డలి, సడెన్ గా ఎలా వచ్చింది? అనేది డౌట్. ఒక సీన్ లో కట్టప్పను పొడవడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ సీన్ లో కట్టప్పకు దగ్గరగా చంపే వ్యక్తి ఉంటాడు. కానీ కెమెరా యాంగిల్ మారినప్పుడు ఆ వ్యక్తి కట్టప్పకు దూరంగా కనిపిస్తాడు. ఒక సీన్ లో రెండు తెల్లటి ఎద్దులు పరుగెడతాయి. కానీ సడెన్ గా అదే సీన్ కంటిన్యూలో తెల్ల ఎద్దు ఉండదు. నల్ల ఎద్దు వస్తుంది. కానీ ఇదెలా? ఆ ఎద్దు సడెన్ గా ఏమైంది? ఇది ఎలా వచ్చింది? ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అయితే ఇదంతా జస్ట్ ఫన్నీ కోసమే బాస్. ఫ్యాన్స్ ను హర్ట్ చేయడానికి కాదని గమనించగలరు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.