Rajinikanth Coolie movie : సౌత్ ఇండియా లో యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన ‘కూలీ'(Coolie Movie). లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని చాలా రోజులే అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం అత్యధిక సమయం తీసుకొని ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడు డైరెక్టర్. మరో వైపు ఈ సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాల్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే ఆల్ టైం ప్రీ రిలీజ్ రికార్డు బిజినెస్ గా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇది వరకు పెద్దగా రాలేదు అనే విషయం తెలిసిందే. కేవలం ఒక్క పాట మాత్రమే విడుదల చేశారు.
ఆ పాట కూడా అనిరుద్(Anirudh Ravichander) రేంజ్ లో లేదనే విమర్శలు వచ్చాయి. అయితే నిన్న విడుదల చేసిన రెండవ లిరికల్ వీడియో సాంగ్ ‘మౌనిక’ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే(Pooja Hegde) ఈ పాట లో వేసిన డ్యాన్స్ కి ప్రేక్షకులు మెంటలెక్కిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్నమొన్నటి వరకు కూలీ చిత్రం పై ఉన్న అంచనాలను ఈ ఒక్క పాట పది రెట్లు పెంచేసింది. ఈ క్రెడిట్ సగం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి వెళ్తే, మిగిలిన సగం పూజ హెగ్డే కి వెళ్తుంది. సింగల్ హ్యాండ్ తో సినిమా హైప్ ని వీళ్లిద్దరు పది రెట్లు ఎక్కువ పెంచేశారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా కంటెంట్ తో సంబంధం లేదు, సిల్వర్ స్క్రీన్ పై కేవలం ఈ ఒక్క పాట ని చూస్తే చాలు అని థియేటర్స్ కి క్యూలు కట్టే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు.
Also Read: నాని ది పారడైజ్ పై కుట్ర… కీలక విషయాలు లీక్ చేస్తుంది ఎవరు?
పూజా హెగ్డే టాలెంట్ ని సరిగ్గా వాడుకోవాలే కానీ, ఇలాంటి మ్యాజిక్స్ క్రియేట్ అవుతూ ఉంటాయని సోషల్ మీడియా లో ఆమె ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ ఏడాది గ్రాండ్ గా విడుదలైన సూర్య ‘రెట్రో’ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమాకు విడుదలకు ముందు హైప్ ఏర్పడడానికి కారణం పూజా హెగ్డే అని బలంగా నమ్ముతారు విశ్లేషకులు. కన్నిమ్మ పాటకు ఆమె వేసిన డ్యాన్స్ అద్భుతం. పైగా ప్రతీ ఈవెంట్ లోనూ ఆమె డ్యాన్స్ వేస్తూ సినిమాని వేరే లెవెల్ లో ప్రమోట్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సినిమాకు ఆ మాత్రం ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం పూజా హెగ్డే అని అంటున్నారు విశ్లేషకులు. పాపం సరైన హిట్స్ తగలడం లేదు కానీ,పూజా హెగ్డే కష్టానికి ఒక్క భారీ బ్లాక్ బస్టర్ అయినా పడాలని, కూలీ లో ఐటెం సాంగ్ చేసినప్పటికీ ఆమెకు మంచి పేరు తీసుకొస్తుందని అంటున్నారు నెటిజెన్స్.