Nani The Paradise: ప్రతీ సినిమా తో తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని అని నిరూపించుకుంటూ వేరే లెవెల్ కి వెళ్తున్న యంగ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) మాత్రమే. ప్రస్తుతం వారసులు ఇండస్ట్రీ ని ఏలుతున్న ఈ రోజుల్లో ఒక సామాన్యుడు ఈ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఇంతటి స్థాయికి ఎదగడం అనేది చిన్న విషయం కాదు. కొత్త ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే టాలెంటెడ్ కుర్రాళ్లకు నాని ఒక ఆదర్శం అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ‘హిట్ 3’ చిత్రం తో మరోసారి వంద కోట్ల గ్రాస్ మార్కుని అవలీలగా అందుకున్న నేచురల్ స్టార్ నాని, తన మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి విస్తరింప చేసేందుకు ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే స్క్రిప్ట్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.
Also Read: నాని ది పారడైజ్ పై కుట్ర… కీలక విషయాలు లీక్ చేస్తుంది ఎవరు?
గతం లో ఆయనకు ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం లో సీనియర్ హీరో మోహన్ బాబు(Manchu Mohan Babu) నటించబోతున్నాడు అనే టాక్, ఈ మూవీ స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం తో ఇది కేవలం రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ అది రూమర్ కాదు,నిజమే అని రీసెంట్ గా ఈ సినిమా నుండి లీకైన ఒక ఫోటో ని చూసిన తర్వాత అర్థమైంది. జైలు గోడపై మోహన్ బాబు స్కెచ్ ఉండడం, అందులో ఆయన లుక్ వింటేజ్ రోజులను గుర్తు చేసింది. ఆయన విలన్ గా నటిస్తున్న రోజుల్లో ఎలాంటి యంగ్ లుక్ లో ఉండేవాడో,అలాంటి లుక్ లోనే కనిపించాడు.
Also Read: చిక్కుల్లో రవితేజ మూవీ… మాస్ మహరాజ్ తీరుకు ఆ డైరెక్టర్ కి భారీ షాక్!
ఇది లేటెస్ట్ ఫోటో నా?, లేకపోతే ఆయన పాత సినిమాల్లో లుక్ ని కాపీ కొడుతూ ఆ స్కెచ్ వేసారా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇందులో మోహన్ బాబు పాజిటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా?, లేదా నెగెటివ్ క్యారక్టర్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. నెటిజెన్స్ ఊహాగానాల ప్రకారం అయితే ఇందులో ఆయన నాని తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని,చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఆయనకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఈ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే మోహన్ బాబు ‘కన్నప్ప’ చిత్రం లో నటించాడు. ఈ సినిమాలో ఆయన క్యారక్టర్ బాగా హైలైట్ అయ్యింది. అద్భుతమైన నటనతో అదరగొట్టేసాడు. ‘ది ప్యారడైజ్’ లో కూడా ఆయనకు మంచి క్యారక్టర్ పడినట్టు ఉంది. ఇది క్లిక్ అయితే ఇక మోహన్ బాబు మళ్ళీ సినిమాలతో ఫుల్ బిజీ కాబోతున్నాడు అనుకోవచ్చు.
#MassGodOdela Cooking Big with Realistic Sets & Strong Story #TheParadise pic.twitter.com/a3FBNmiels
— Johnnie Walker (@JohnnieWaIker) July 9, 2025