Caretaker Vijayawada murder: ఇంట్లో తల్లి సంరక్షణ కోసం కేర్ టేకర్ ను ( caretaker ) ఏర్పాటు చేశారు ఓ విశ్రాంత ఉద్యోగి. అదే ఆయన పాలిట శాపంగా మారింది. మృత్యువును కబలించింది. కేర్ టేకర్ గా చేరిన సదరు మహిళ ఇంటి యజమానిని దారుణంగా హత్య చేసి.. బీరువాలో ఉన్న సామాన్లు, నగదు, బంగారంతో ఉడాయించింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో..
విజయవాడ ( Vijayawada)ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకట రామారావు ఆర్ అండ్ బి లో ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందారు. పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. దీంతో రామారావు తన 92 ఏళ్ల తల్లి సరస్వతి తో కలిసి నివాసం ఉంటున్నారు. గత రాత్రి ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో బంగారం, ఇతర ఆస్తి పత్రాలు, నగదు కనిపించకపోవడంతో.. వాటి కోసమే వెంకట రామారావును హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అప్పటివరకు అక్కడ పనిచేసిన కేర్ టేకర్ కనిపించకపోవడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Also Read: వైసీపీలోకి టిడిపి సీనియర్ ఎమ్మెల్యే.. ఫుల్ క్లారిటీ
ఐదు రోజుల కిందట కేర్ టేకర్ గా..
వెంకట రామారావు తల్లి సరస్వతి వృద్ధాప్యం దృష్ట్యా.. ఆమె కోసం కేర్ టేకర్ ను ఏర్పాటు చేశారు. అయితే ఆ కేర్ టేకర్ మానేయడంతో.. ఐదు రోజుల కిందట అనూష అనే మహిళను కేర్ టేకర్ గా ఎంపిక చేశారు. అనూష రోజు సరస్వతి గదిలో పడుకునేది. గురువారం రాత్రి మాత్రం హాల్లో పడుకుంది. అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో సరస్వతి కి మెలుకువ వచ్చింది. కుమారుడు గది తలుపులు తెరిచి లైట్లు వేయగా మంచం పై వెంకట రామారావు అచేతనంగా పడి ఉన్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. రామారావు శరీరంపై కారం చల్లి ఉంది. అనూష ఇంట్లో లేదు. దీంతో పక్కింటి వారు వచ్చి చూడగా రామారావు మృతిచెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం అందించారు.
పక్కా ప్రణాళికతోనే
అయితే వెంకట రామారావును( Venkata Rama Rao) హత్య చేసింది కేర్ టేకర్ అనూషగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన అనూషకు వివాహం జరిగింది. ఆమె భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ ఏడాది మేలో ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేంద్ర తో కలిసి గుంటూరు జిల్లా నులకపేట వచ్చింది. అక్కడే ఓ అద్దె ఇంట్లో వారు ఉంటున్నారు. ఐదు రోజుల కిందట రామారావు ఇంట్లో కేర్ టేకర్ గా చేరింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లోంచి వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చింది. అప్పుడే రామారావును మొట్టు పెట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో మరో వ్యక్తి రామారావు ఇంటిలో ప్రవేశించినట్లు.. అరగంట తర్వాత ఆటోలో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ రామారావు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసి ఉంటారని నిర్ధారించారు. అక్కడ నుంచి ఆటోలో నులకపేట వెళ్లి.. పది నిమిషాల్లో ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లిపోయినట్లు పోలీస్ విచారణలో తేలింది. విజయవాడ నుంచి వారిద్దరు తిరుపతి బస్సు ఎక్కినట్లు సిసి ఫుటేజ్ లో గుర్తించారు. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) July 11, 2025