Heroine : దర్శకుడు శరవనన్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా సినిమాలో శర్వానంద్, అంజలి, జై, అనన్య ప్రధాన పాత్రలలో కనిపించారు. జర్నీ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా వ్యవహరించారు. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ తమిళ్ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని పాత్రలు అన్నీ కూడా ఎంతో సహజంగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం ఒకటి రెండు ఏళ్లలోనే హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లు కేవలం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లకు వరుసగా హిట్స్ వచ్చిన, ఫాలోయింగ్ బాగా ఉన్నా కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారు. జర్నీ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ కూడా అంతే. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలలో జర్నీ సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 16, 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జర్నీ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం సాధించింది.
Also Read : ఎంతో అందంగా ఉన్నా కూడా సినిమాలకు దూరం.. కారణం ఇదే..
జర్నీ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్ తో పాటు తమిళ్ హీరో జై కూడా నటించాడు. తమిళ్ తో పాటు ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరో శర్వానంద్ జోడిగా నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. జర్నీ సినిమాలో ఈ బ్యూటీ తన క్యూట్ నెస్ తో అమాయకత్వపు నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ హీరోయిన్ పేరు అనన్య. తెలుగులో అనన్య కేవలం ఒకటి రెండు సినిమాలలోనే కనిపించింది. మొదటిసారి అనన్య మలయాళ సినిమా పాజిటివ్ తో 2008లో తన కెరియర్ను మొదలుపెట్టింది. ఈమె ఆంజనేయం అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అనన్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది.
తెలుగులో అనన్య నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాలో కూడా నితిన్ చెల్లెలుగా నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ కు జోడిగా సమంత నటించింది. అలాగే అనన్య చివరిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా కనిపించింది. ప్రస్తుతం అనన్య ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ చాలామంది అభిమానులు సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అనన్యకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అనన్య తన అందంతో మెస్మరైజింగ్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుంది.
View this post on Instagram