Post Office Schemes : అందులో అందించే పథకాలు ప్రజాహితం కోసం ఏర్పాటు చేసినవి కావడంతో వడ్డీ సైతం మంచిగా లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో పీపీఎఫ్ సురక్షితమైన పెట్టుబడి పథకాన్ని. 7.1 శాతం ఈ పథకం కింద వడ్డీ రేటు లభిస్తుంది. ఒక సంవత్సరంలో రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఈ పథకంలో డిపాజిట్ చేసుకోవచ్చు. 15 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉంటుంది. ఏడేళ్లు దాటిన తర్వాత అవసరమైతే కొంత నగదు తీసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే 15 ఏళ్ల తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలా గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఈ పథకాన్ని పొడిగించుకోవచ్చు. ఈ ఫాతాను మీకు సమీప పోస్టాఫీసులో లేదా బ్యాంకులో తెరవవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మరొక అద్భుత పథకం టిడి పథకం. ఈ పథకం బ్యాంకు ఎఫ్డి లాంటిది. పోస్ట్ ఆఫీస్ లో టీడీ ఖాతాలను 1,2,3 లేదా ఐదు సంవత్సరాల కాలానికి తెరవవచ్చు.
Also Read : గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు.. రెండో జాబితా విడుదల
ఈ పథకానికి వడ్డీ రేటు 6.9% నుంచి 7.5% వరకు ఉంటుంది. ఐదు సంవత్సరాలకు గాను టీడీ పథకం కింద 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ పథకం కోసం కనీసం రూ.100 లతో ఖాతాను తెరవవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. టిడి పథకానికి ఐదు సంవత్సరాల తర్వాత పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మరొక అద్భుత పథకం సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల కోసం. ఈ పథకం కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాదిలో కనీసం రూ.250 పెట్టుబడి పెడితే గరిష్టంగా రూ.1,50,000 పెట్టుబడి పెట్టుకోవచ్చు.
21 సంవత్సరాల తర్వాత ఈ పథకం ముగిస్తుంది. ఒకవేళ కూతురికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి జరిగితే ఈ ఖాతాను మూసి వేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న మరో అద్భుత పథకం కిసాన్ వికాస్ పాత్ర. దీంట్లో 7.5% వడ్డీ లభిస్తుంది. కనీసం గా వెయ్యి రూపాయలతో ఖాతాను పోస్ట్ ఆఫీస్ లో తెలవవచ్చు. ఈ పథకానికి గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల ఏడు నెలలలో రెట్టింపు అవుతుంది.
Also Read : మన దగ్గర ఖరీదు.. ఆ దేశాల్లో చవక.. బంగారం ధరల తీరిదీ..