Maruti Suzuki Brezza On Road Price: Maruti Suzuki కార్లు అంటే ఎగబడి కొనేవారు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఈ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభివృద్ధిలకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతుంది. సెడాన్ నుంచి ప్రీమియం కార్ల వరకు వినియోగదారులకు పరిచయం చేసే ఈ కంపెనీ 2026 లో కొత్తగా SUV కారును తీసుకురాబోతుంది.. ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి SUV వేరియంట్ లో Brezza అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మోడల్ ఇప్పుడు అప్డేట్ వెర్షన్తో రాబోతుంది. గతంలో కంటే ఇప్పుడు ఇంజన్, డిజైన్, ఫీచర్లలో కొన్ని మార్పులు చేసుకోబోతుంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
2026 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో Maruti Suzuki Brezza కొత్త కారు రాబోతుంది. ఈ కారుకు LED హెడ్ లాంప్స్ నవీకరించబడ్డాయి. వీటికి DRL సపోర్ట్ ఉండడంతో ఆకర్షణీయంగా ఉండలున్నాయి. ఫ్రంట్ గ్రిల్, బంపర్ లేటెస్ట్ వినియోగదారులకు అనుగుణంగా మార్చారు. అల్లాయి వీల్స్ డిజైన్స్ కొత్తగా తయారు చేశారు. అలాగే ఆకర్షణీయమైన రంగులను ఎంపిక చేశారు. ఇంటీరియర్ లో సాఫ్ట్వేర్ టెక్నాలజీని అప్డేట్ చేశారు. ఈ కొత్త కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండనుంది. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను చేర్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సెట్ చేశారు. అలాగే ఇందులో వెంటిలేటెడ్ సీట్స్, యాంబియంట్ లైటింగ్, ప్రీమియం డాష్ బోర్డు వంటివి చేర్చారు.
ఇంజన్ విషయానికి వస్తే ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉండడంతో హైబ్రిడ్ ఇంజన్ తో స్మూత్ డ్రైవింగ్ ఉండనుంది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండనున్నాయి. కొత్తగా ఇందులో ADAS టెక్నాలజీని అమర్చనున్నారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటివి రక్షణ ఇస్తాయి. ఒక కాంట్రాక్టు SUV కారులో ఈ ఫీచర్లు ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఇది మార్కెట్లోకి వస్తే రూ.8.50 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
చాలామంది కార్లు కొని సమయంలో విశాలమైన క్యాబిన్ ఉండాలని అనుకుంటారు. కొత్తగా వచ్చే ఈ కారులో క్యాబిన్ సౌకర్యవంతంగా ఉండనుంది. ఇందులో ప్రయాణించే వారికి లెగ్ రూమ్ ఎక్కువగా ఉండడంతో ఎలాంటి అలసట లేకుండా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే వారికి వెంటిలేషన్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది.