spot_img
Homeఎంటర్టైన్మెంట్Krithi Shetty: అదేమిటి ? ఎందుకు అని అడిగితే ? అది బయట...

Krithi Shetty: అదేమిటి ? ఎందుకు అని అడిగితే ? అది బయట పెట్టింది

Krithi Shetty: ఉప్పెన సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేసింది కృతి శెట్టి. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. ప్రస్తుతం తన గ్లామ‌ర్‌ తో, యాక్టింగ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఉప్పెన మూవీ ఇచ్చిన స‌క్సెస్‌ తో కృతి శెట్టి పెద్దగా కష్టపడకుండానే వ‌రుస ఆఫ‌ర్లు తన ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న యంగ్ హీరోయిన్స్ లిస్ట్ లో.. ‘కృతి శెట్టి’ పేరే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

Krithi Shetty
ntr, Krithi Shetty

ఇటీవ‌ల కాలంలో రష్మిక మందన్నా త‌ర్వాత మూడు, నాలుగు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ కృతి శెట్టినే కావ‌డం విశేషం. అయితే త‌క్కువ టైంలోనే ఇలా ఆఫ‌ర్లు వ‌చ్చినా అంత సంతృప్తికరంగా లేద‌ట కృతి శెట్టి. అదేమిటి ? ఎందుకు అని అడిగితే ? అసలు విషయం బయట పెట్టింది. కృతి శెట్టి ఉప్పెన సినిమా రిలీజ్ సమయంలో తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ను కలుసుకుందట.

Also Read: Chiranjeevi- Balakrishna: బాలయ్యకి పోటీగా మెగాస్టార్.. మరీ దీనిలో కూడా పోటీనా ?

అప్పటి నుంచి కృతి శెట్టికి ఎన్టీఆర్ పై అభిమానం కలిగిందట. అందుకే.. ఇపుడు వ‌స్తున్న ఆఫ‌ర్లు కాకుండా ఎన్టీఆర్ సినిమాలో అవకాశం కోసం అమ్మడు ఆశగా ఎదురుచూస్తుంద‌ట‌. ఎన్టీఆర్‌ తో పాటు మ‌హేశ్ బాబు, రాంచ‌రణ్‌, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకోవాలని ఈ యంగ్ బ్యూటీ తెగ ఆరాట పడుతుంది.

Krithi Shetty
Krithi Shetty

ముందుగా తనకు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా అవ‌కాశం వ‌స్తే బాగుంటుంద‌ని కృతి శెట్టి ఓపెన్ గా చెప్పేస్తోంది. పైగా రీసెంట్ గా కొరటాల శివను కూడా కృతి శెట్టి పర్సనల్ గా వెళ్లి కలిసిందట. కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. పైగా కొరటాల శివ ఏన్టీఆర్ తో చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుంచి మోషన్ పోస్టర్ వీడియోను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ గంభీరమైన డైలాగ్ తో సాగిన ఈ వీడియోలో భారీ విజువల్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఈ సినిమాలో తనకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వండి అని కృతి శెట్టి మొత్తానికి కొరటాలకు రిక్వెస్ట్ పెట్టుకుంది. అయితే.. ఈ సినిమాలో ఇప్పటికే సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది.

Also Read:Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper