Hero Srikanth
Hero Srikanth: హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన తమ్ముడు అనిల్ కుమార్తె వివాహ వేడుకలు జరుగుతున్నాయి. తమ్ముడు కూతురు పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాల్గొన్న శ్రీకాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భార్య ఊహ, కొడుకులు రోషన్, రోహన్, కూతురు మేధ హాజరు కావడం జరిగింది. శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమించేది ఎందుకమ్మా? టైటిల్ తో 1999లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో అనిల్ నటించారు. అనిల్ కి జంటగా మహేశ్వరి నటించడం విశేషం.
ప్రేమించేది ఎందుకమ్మా? చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. మరలా అనిల్ నటించలేదు. అయితే నిర్మాతగా మారాడు. అన్నయ్య హీరోగా విరోధి టైటిల్ తో ఒక మూవీ నిర్మించారు. అది ఆడలేదు. నటుడిగా, నిర్మాతగా విఫలమైన నేపథ్యంలో అనిల్ చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆయన కుమార్తె వివాహం జరుగుతుండగా శ్రీకాంత్ కుటుంబం పాల్గొన్నారు.
ఇక చాలా కాలం తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీ కలిసి కనిపించింది. ఇటీవల శ్రీకాంత్-ఊహ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై శ్రీకాంత్ మండిపడ్డారు. ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తారో తెలియదని ఆయన వాపోయారు. హీరోయిన్ ఊహను శ్రీకాంత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు రోషన్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. గత ఏడాది పెళ్లిసందD టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశారు.
తాజాగా శ్రీకాంత్, రోషన్ కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వృషభం లో తండ్రీకొడుకుల కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల వృషభం షూటింగ్ మొదలైంది. ఇక శ్రీకాంత్ విలన్ గా బిజీ అవుతున్నారు. అఖండ చిత్రంలో భయపెట్టిన శ్రీకాంత్ వారసుడులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. నెక్స్ట్ ఆయన దేవర, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటించనున్నారు.