Deodhar Trophy 2023: క్రికెట్ లో కొందరు ఆటగాళ్లు పట్టే క్యాచులు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అసలు ఇటువంటి క్యాచులు పట్టడం సాధ్యమా..? అనే అంతగా కొందరు ఆటగాళ్లు పట్టే ఉంటాయి. తాజాగా అటువంటి క్యాచ్ నే పట్టాడు పంజాబ్ జట్టు వికెట్ కీపర్ ప్రబు సిమ్రాన్ సింగ్. దేవదర్ ట్రోఫీ లో భాగంగా జరిగిన ఒక మ్యాచ్ లో ఈ అద్వితీయమైన క్యాచ్ ను అందుకుని ఆశ్చర్యానికి గురి చేశాడు.
దేవధర్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్, నార్త్ జోన్ జట్ల మధ్య మ్యాచ్ సోమవారం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కునాల్ (70), మయాంక్ అగర్వాల్(64), జగదేశన్ (72) అర్థ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో మార్కండే, రిషి ధావన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక లక్ష్య సాధనలో నార్త్ జోన్ జట్టు కేవలం 60 కరుగులకే కుప్ప కూలింది. జట్టులో ఖజూరియా(10), మందీప్ సింగ్(18) మినహా మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. కావేరప్ప 5 వికెట్లతో చెలరేగి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు.
అద్భుతమైన క్యాచ్ తో ఆశ్చర్యానికి గురైన అభిమానులు..
క్రికెట్లో ఎంతోమంది అద్భుతమైన క్యాచులు అందుకున్నారు. వీటిలో ఎన్నో నమ్మశక్యం కాని క్యాచులు కూడా ఉండే ఉంటాయి. తాజా మ్యాచ్ లో కూడా ప్రబు సిమ్రాన్ సింగ్ పట్టిన క్యాచ్ ఆ లిస్టులోకి చేరింది. సౌత్ జోన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 39 వ ఓవర్లో మయాంక్ యాదవ్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతిని రికీ బుయికి షార్ట్ బాల్ విసిరాడు. దీంతో ఈ బంతిని అప్పర్ కట్ చేయాలని భావించిన బుయి.. వికెట్ కీపర్ ప్రభు సిమ్రాన్ సింగ్ చేతికి చిక్కాడు. చాలా దూరంగా వెళుతున్న ఈ బంతిని పక్షి లాగా డ్రైవ్ చేసి ఒడిసిపెట్టాడు సిమ్రాన్ సింగ్. విమానం లాగే పూర్తిగా గాలిలో తేలిపోయిన సిమ్రాన్ సింగ్ అందుకున్న ఈ క్యాచ్ చూస్తే వావ్ అనాల్సిందే. అభిమానులతో పాటు సహచర ఆటగాళ్లు కూడా ఈ క్యాచ్ కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ప్రభు సిమ్రాన్ సింగ్ పట్టిన ఈ క్యాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Ripper Alert
You do not want to miss Prabhsimran Singh’s flying catch behind the stumps
WATCH Now #DeodharTrophy | #NZvSZhttps://t.co/Tr2XHldbHY
— BCCI Domestic (@BCCIdomestic) July 24, 2023
Web Title: Deodhar trophy prabsimran singh takes a brilliant flying catch to dismiss ricky bhui from south zone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com