Homeఎంటర్టైన్మెంట్Sukumar: సుకుమార్ ను అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోలు...

Sukumar: సుకుమార్ ను అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోలు…

Sukumar: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తీసేంత వరకు కొడుతూనే ఉంటుందనే సామెత సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది తమ కెరియర్ మొదట్లో మంచి కథలను రాసుకొని హీరోలకు వినిపించినప్పుడు వాళ్లు దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఇక ఆ దర్శకుడు వేరే హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు సూపర్ హిట్ లను కట్టబెట్టి టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ సైతం కెరియర్ మొదట్లో […]

Sukumar: అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తీసేంత వరకు కొడుతూనే ఉంటుందనే సామెత సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది తమ కెరియర్ మొదట్లో మంచి కథలను రాసుకొని హీరోలకు వినిపించినప్పుడు వాళ్లు దాన్ని రిజెక్ట్ చేస్తుంటారు. ఇక ఆ దర్శకుడు వేరే హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు సూపర్ హిట్ లను కట్టబెట్టి టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ సైతం కెరియర్ మొదట్లో ఆర్య సినిమా కథను చాలామంది హీరోలకు వినిపించారట. కథను విన్నా చాలా మంది దాన్ని రిజెక్ట్ చేశారు. కారణం ఏంటంటే ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ కొంచెం నెగెటివ్ షేడ్స్ తో కూడుకొని ఉంటుంది కానీ అది నెగెటివ్ పాత్ర కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ కథ నచ్చక చాలామంది దాన్ని రిజెక్ట్ చేశారు. అందులో ప్రభాస్ ఉండడం విశేషం…అతన్ని మొదట్లో రిజెక్ట్ చేసిన హీరోలు సుకుమార్ తో ఆ తర్వాత సినిమా చేసే అవకాశం దక్కించుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.

కాబట్టి అతనితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సుకుమార్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ప్రభాస్ కి చాలా బాగా ఇష్టమట…

ఇక సుకుమార్ డైరెక్షన్ లో నటించాల్సిన మరో హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్ మొదట్లోనే తన మొదటి సినిమాను సుకుమార్ తో చేయిద్దామని నాగార్జున అనుకున్నాడట. కానీ అఖిల్ కి సుకుమార్ చెప్పిన కథ అంత పెద్దగా నచ్చకపోవడంతో ఆయన సుకుమార్ కంటే కూడా వినాయక్ వైపే ఎక్కువగా మొగ్గు చూపించాడు.

మొత్తానికైతే అఖిల్ కి అప్పటినుంచి ఇప్పటివరకు ఒక సక్సెస్ కూడా లేదు. రీసెంట్ గా ‘లెనిన్’ సినిమాతో సక్సెస్ ని సాధించి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు… ఇక ఇప్పటికీ ఆయన సుకుమార్ తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికి సుకుమార్ మాత్రం ప్రస్తుతం ఉన్న బిజీ వల్ల అఖిల్ తో సినిమా చేయడం కుదరదని డైరెక్ట్ గా చెప్పేసారట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper