https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ తో రానానే.. ఫిక్స్

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమా రిమేక్ హక్కులను నిర్మాత  సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని ఆయన ప్లాన్ చేశాడు. మొదట ఈ సినిమా అగ్ర హీరో నందమూరి బాలయ్య దగ్గరికి వెళ్లింది. అయితే ఈ సినిమాపై బాలయ్య ఆసక్తి చూపించకపోవడంతో  పలువురు హీరోల చుట్టూ తిరిగింది. Also Read: పవన్ ను షూట్ కి ఒప్పించారు ! ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 07:30 PM IST
    Follow us on

    మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ సినిమా రిమేక్ హక్కులను నిర్మాత  సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని ఆయన ప్లాన్ చేశాడు. మొదట ఈ సినిమా అగ్ర హీరో నందమూరి బాలయ్య దగ్గరికి వెళ్లింది. అయితే ఈ సినిమాపై బాలయ్య ఆసక్తి చూపించకపోవడంతో  పలువురు హీరోల చుట్టూ తిరిగింది.

    Also Read: పవన్ ను షూట్ కి ఒప్పించారు !

    ఈ సినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తెలుగులో రిమేక్ చేయబోతోంది.మొదట ఈ సినిమాలో రవితేజ అండ్ రానా కలిసి నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ రిమేక్ పై పవన్ ఆసక్తి చూపిస్తున్నాడని.. పవన్ ను చిత్రబృందం కలిసిందని సమాచారం. పవన్ ఈ సినిమాకు ఒప్పుకున్నాడు. సినిమా కూడా ప్రకటించి

    పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న రిమేక్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’పై సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. రెండో హీరో పాత్ర కోసం మొదట రానా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఎంతో కీలకమైన ఈ పాత్రకు తమిళ హీరో విజయ్ సేతుపతి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. సుదీప్, గోపిచంద్ వంటి హీరోల పేర్లు పవన్ పక్కన వినిపించాయి.

    ఈ క్రమంలోనే ఈ గాసిప్పులకు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సెలవిచ్చింది. ఈ పాత్రనే రానానే చేస్తానన్నారని.. ఆయనతోనే నిర్మిస్తామని క్లారిటీ ఇచ్చింది.

    Also Read: యాక్షన్ అంటేనే భయపడుతున్న యాక్షన్ డైరెక్టర్ !

    నిజానికి విజయ్ సేతుపతిని ఓ దశలో అనుకున్నారు ., కానీ అప్పుడే డ్రాప్ అయ్యారు. గోపీచంద్ గురించి పుకార్లే అని తేలింది. అయ్యప్పన్ లో రెండో హీరో పాత్రకు నూటికి నూరు శాతం రానా సరిపోతాడని.. సితారా నిర్మాణ సంస్థ భావించింది.

    ఇప్పటికే బాహుబలితో నిరూపించుకున్న రానా.. పవన్ తో కలిసి నటిస్తే బాక్సాఫీస్ బద్దలే అని రానాతోనే వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్