https://oktelugu.com/

పవన్ ను షూట్ కి ఒప్పించారు !

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రజెంట్ వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను షూట్ చేస్తున్నారు. కాగా ఇంకొద్దిరోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తవుతాయి. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. వైష్ణవ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. […]

Written By:
  • admin
  • , Updated On : November 18, 2020 / 07:22 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ ప్రజెంట్ వైష్ణవ్ తేజ్ సినిమాను ముగించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ను షూట్ చేస్తున్నారు. కాగా ఇంకొద్దిరోజుల్లో ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తవుతాయి. ఇక ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని.. వైష్ణవ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పెన సినిమాకి కూడా బాగా పాజిటివ్ టాక్ ఉంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే వైష్ణవ్ తేజ్ ఖాతాలో రెండు హిట్లు రాబోతున్నాయి.

    Also Read: బిగ్ బాస్-4: ‘బార్డర్’ దాటొద్దంటూ ఆదేశం.. ఎందుకంటే?

    అయితే క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకే నటించడానికి పవనే కారణమట. పవన్ చెప్పడంతోనే క్రిష్ ఈ సినిమా చేశాడట. ఇక క్రిష్ డైరెక్షన్ లో పవన్ చేస్తోన్న సినిమాను రీస్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. మొదట పవన్ ‘వకీల్ సాబ్’ పూర్తయ్యాక క్రిష్ సినిమానే చేయాలని అనుకున్నారు. కానీ మధ్యలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చకచకా సెట్టైపోవడంతో ఆ సినిమా కోసం పవన్ కాల్ షీట్స్ కేటాయించాల్సి వచ్చింది. దాంతో క్రిష్ – పవన్ సినిమా వాయిదాపడే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం డిసెంబర్లో ఎలాగైనా షూట్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: స్టార్ డైరెక్టర్ కి వెబ్ సిరీస్ కూడా కష్టమేనా ?

    మధ్య మధ్యలో పవన్ కొన్ని డేట్స్ కేటాయిస్తే కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని క్రిష్ అనుకుంటున్నాడు. అందుకోసం ఇప్పటికే పవన్ ను కూడా ఒప్పించాడట. అందుకే క్రిష్ కు తోడుగా నిర్మాత ఏ.ఎమ్.రత్నం కూడా షూట్ త్వరగా స్టార్ట్ చేయడానికి రంగంలోకి దిగారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ప్రస్తుతం ఏ.ఎమ్.రత్నం హైదరాబాద్లోనే ఉండి షూట్ ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి, ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై దర్శకుడితో చర్చలు జరుపుతున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్