జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ వరాల మూట విప్పారు. హైదరాబాదీలను ఆకట్టుకునే చర్యలు చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలపై 16 పేజీలతో కూడిన జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ బుధవారం విడుదల చేశారు. కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సినవ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు.
Also Read: బ్రేకింగ్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితా విడుదల
టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ లో చేసిన అభివృద్ధి, కరోనా చర్యలు, వరదల సమయంలో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మేనిఫెస్టోను విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దూకుడుగా ముందుకెళుతున్న సీఎం కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సమావేశమై గ్రేటర్ పై సమరశంఖం పూరించారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం టీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నేతలు తిప్పికొట్టాలన్నారు.
Also Read: జీహెచ్ఎంసీలో పోటీ.. పవన్ చేసిన పెద్ద తప్పు అదేనా?
డిసెంబర్ రెండోవారంలో జాతీయ స్తాయి నేతలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సదస్సుకు దేశంలోని ప్రధాన పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ నేత కుమారస్వామి, శరద్ పవార్ తో మాట్లాడినట్టు నేతలకు వివరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు.
*టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు ఇవీ..
* హైదరాబాద్ నగరమంతా ఉచిత వైఫై ఏర్పాటు చేస్తాం
* హైదరాబాద్‌లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతులు
* హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక
* కొత్తగా 4 ఆడిటోరియంల నిర్మాణం
* జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ
* మూసీ పునరుద్దరణ, సుందరీకరణ..
* రూ.1,900 కోట్లతో మరో 280 కిలోమీటర్ల మేర మిషన్ భగీరథ పైపులైన్
* రూ.130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్ల ఏర్పాటు
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్