Pan India Movie: ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మోస్తరు బడ్జెట్ తో నిర్మితమయ్యే సినిమాలు మొత్తం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కచ్చితంగా విడుదల చేయడాన్ని మేకర్స్ అలవాటుగా మార్చుకున్నారు. అన్ని ప్రాంతాల చెందిన నటులను పెట్టుకోవడం.. మార్కెటింగ్ చేసుకోవడం.. ప్రమోషన్లు నిర్వహించడం.. పరిపాటిగా మారిపోయింది.
పాన్ ఇండియా లెవెల్ లో తీసిన సినిమాలలో అన్నింటికీ బీభత్సమైన కలెక్షన్లు రావడం లేదు. ఇందులో కొన్ని సినిమాలు మాత్రమే విజయవంతమవుతున్నాయి. ఇక తెలుగులో మీడియం బడ్జెట్ హీరోలు.. హై రేంజ్ హీరోలు .. తమ సినిమాలకు పాన్ ఇండియా ముద్ర వేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది అయితే ఇప్పుడు తెలుగులో ఓ పాన్ ఇండియా సినిమా చుట్టు విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాను ఇద్దరు నిర్మాతలు కలిసి నిర్మించారు. ఈ సినిమాలో బై లింగ్వల్ హీరోగా గుర్తింపు ఉన్న స్టార్ నటించారు. పెద్ద దర్శకుడు రూపొందించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలో అనూహ్యమైన పరిణామం జరిగింది.
ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు ఒక నిర్మాత పేరు కనిపించింది. ఇప్పుడు సినిమా విడుదలకు సంబంధించిన పోస్టర్లలో.. న్యూస్ ఆర్టికల్స్ లో ఆయన పేరు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు నుంచి నిర్మాత తప్పుకున్నారా.. అనే ప్రచారం నడుస్తోంది. లేదా తెర వెనుక ఏదైనా జరుగుతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక ప్రొడ్యూసర్.. ఫిల్మ్ మేకర్ తో పాటు ఒక నిర్మాతకు సంబంధించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తున్నాయి. ఆ నిర్మాత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మంటలు పుట్టించాయి. దీంతో ఆ మాటలు వెనుక ఉన్న ప్రభావం ఈ ప్రాజెక్టు మీద పడుతోందని సమాచారం.
ఆ ఫిల్మ్ మేకర్ నుంచి వచ్చే సినిమాలో విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులోకి వచ్చిన ప్రొడ్యూసర్ ఎటువంటి ప్రత్తిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి పరిణామాల మధ్య ఉన్నటువంటి ఆ ప్రొడ్యూసర్ పేరు కనిపించడం లేదు. ఇప్పుడు ఆ సినిమా విడుదల బాధ్యతలను మరో నిర్మాత భుజాలకు ఎత్తుకున్నారా.. లేక ఈ పేరు మార్పు వెనుక ఇంకా ఏమైనా జరుగుతోందా.. మొత్తానికి ఇదంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా గనుక సొంతంగా విడుదల చేస్తే.. ఆ నిర్మాత ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలియడం లేదు.. వాస్తవానికి ఆ నిర్మాత పేరును ఎందుకు పక్కన పెట్టారు.. ఇది కేవలం చర్చ కోసం తీసుకున్న నిర్ణయమా.. ఇంకా ఏదైనా జరుగుతోందా.. ఈ ప్రశ్నలకు సమాధానం మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.