Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ రోహిత్ కి దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చు. ‘అగ్ని పరీక్ష 2’ నుండి భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ , ఆ అంచనాలను అందుకోవడం లో కాస్త వెనకపడ్డాడు కానీ , మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే మాత్రం రోహిత్ చాలా బెటర్ అనిపిస్తున్నాడు. అందుకే ఓటింగ్ లో అతనికి తిరిగే లేకుండా పోయింది. పైగా ప్రతీ వారం హోస్ట్ నాగార్జున రోహిత్ తప్పు ఉన్నా లేకపోయినా నాన్ స్టాప్ గా కోటింగ్ ఇస్తూ రావడం తో , జనాల్లో సానుభూతి వేరే లెవెల్ లో పెరిగిపోయింది. దీంతో ఆడియన్స్ అతన్ని విన్నర్ చేయాలనీ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సీజన్ లో రోహిత్ ని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేయడం అసాధ్యం.
అందుకే త్రిగున్ , ముకేశ్ మాస్టర్ ప్లాన్ వేశారు. అదేమిటంటే రోహిత్ కి ఇప్పటికే ఎల్లో కార్డు వచ్చింది , అతనికి రెడ్ కార్డు వస్తే , హోస్ట్ నాగార్జున చేత ఎలిమినేట్ కాబడుతాడు. అసలే రోహిత్ పై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి లో అతన్ని రెచ్చగొడితే వేరే లెవెల్ లో ట్రిగర్ అవుతాడు , ఏమి చేస్తాడో తనకే తెలియని పరిస్థితి ఎదురు అవుతుంది. ఈ వారం జరిగిన నామినేషన్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక వీధి రౌడీ లాగానే రోహిత్ ఈ నామినేషన్స్ లో ప్రవర్తించాడు అనే చెప్పొచ్చు. త్రిగున్ ట్రిగర్ చేయడం , రోహిత్ రెచ్చిపోవడం, ఇదే రిపీట్ గా జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే త్రిగున్ ‘పోరా’ అని అన్నాడో , అప్పుడు రోహిత్ చెంప పగులుద్ది అని వార్నింగ్ ఇస్తాడు. అంతే కాదు , బయటకు రాకుండా ఉండవు కదా, అప్పుడు చూసుకుందాం అని కూడా అంటాడు.
అతని ప్రవర్తన చూస్తుంటే ఎదో ఒక రోజు కొట్టేలాగానే ఉన్నాడని అనిపిస్తోంది. త్రిగున్ ప్లాన్ కూడా అదే. నామినేషన్స్ అయిపోయిన తర్వాత రోహిత్ గురించి త్రిగున్ మాట్లాడుతూ వీడు రెండు , మూడు వారాలకు మించి ఎక్కువ ఉండడు అని అంటాడు. అంటే అతని ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆటో రామ్ ప్రసాద్ కూడా , ఎదో ఒక రోజు రోహిత్ త్రిగుణ ని కొడుతాడు చూడండి అని ముకేశ్ తో అంటాడు. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో రోహిత్ , ముకేశ్ కి మధ్య కూడా గొడవలు జరుగుతాయి. ఈ గొడవ లో రోహిత్ ‘దమ్ముంటే నన్ను బయటకు పంపు చూద్దాం’ అని అనడం , ఆ ప్లాన్ లోనే ఉన్నా అని ముకేశ్ కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. దీని అర్థం ఏమిటంటే , ఈయన కూడా రోహిత్ ని రెచ్చగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. మొత్తం మీద వీళ్లిద్దరు ఎలా అయినా రోహిత్ కి రెడ్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది.
అయితే రోహిత్ వీళ్ళ ప్లాన్ ని పసిగట్టినట్టుగానే అనిపిస్తోంది. ఎందుకంటే నామినేషన్స్ రెండవ రోజున రోహిత్ చాలా కూల్ గా ఉన్నాడు. ఎక్కడా తన కంట్రోల్ కోల్పోలేదు. సైలెంట్ గా కూర్చున్నాడు. ఇక నామినేషన్స్ పూర్తి అయ్యాక అందరితో చాలా స్నేహంగా మాట్లాడాడు. ఎప్పుడూ లేని విధంగా వర్షిణి తో కూడా ఆయన చాలా క్లోజ్ గా మాట్లాడడం , జోకులు వేయడం నిన్ననే జరిగింది. దీన్ని బట్టీ రోహిత్ తనలోని అగ్రేషన్ ని పసిగట్టి , దాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.