Homeఎంటర్టైన్మెంట్Khushboo Daughter : వామ్మో.. కుష్బూ కూతురు.. ఇలా రెచ్చపోయిందేంటి? కారణం అదేనా?

Khushboo Daughter : వామ్మో.. కుష్బూ కూతురు.. ఇలా రెచ్చపోయిందేంటి? కారణం అదేనా?

Khushboo Daughter : టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇతర పరిశ్రమ నుంచి వచ్చిన ఎందరో భామలు సినీ ప్రేక్షకులను అలరించారు. నాటి నుంచి నేటి వరకు తమిళం, మలయాళం ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు తెలుగు అగ్రహీరోల మధ్య నటించి ఆకట్టుకున్నారు. వీరిలో కుష్బూ ఒకరు. తెలుగులో విక్టరీ వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’ అనే సినిమాతో కుష్బూ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ మూవీ వెంకీ కూడ డెబ్యూనే కావడం విశేషం. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించారు. అయితే ఆ తరువాత కొన్నాళ్లపాటు టాలీవుడ్ కు దూరమైన ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా పలు సినిమాల్లో కనిపిస్తోంది. లేటేస్ట్ గా శర్వానంద్ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటించారు. తాజాగా కుష్బూ కూతురు గురించి ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయమేంటంటే?

హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో అలరించిన కుష్బూ ఎన్నడూ తన పర్సనల్ విషయాలను బయటపెట్టేవారు కాదు. కానీ ఇటీవల ఆమె కూతురు గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. కుష్బూ కు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఒకరు అవంతిక. ఈమె ప్రస్తుతం అమెరికాలో చదువుతోంది. అయితే కుష్బూ లాగే అవంతికకు సినిమాల్లోకి రావాలని ఆశ ఉన్నట్లుంది. తల్లితో పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇందులో భాగంగా లేటేస్టుగా అవంతికకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలను షేర్ చేసింది. అందాలను ఆరబోస్తూ ఉన్న ఈ పిక్స్ చూసి సినీ జనం షాక్ అవుతున్నారు. తల్లి లాగే అవంతిక కూడా ఎంతో అందంగా ఉన్నారు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా తొందరగా ఇండస్ట్రీకి వచ్చి సినీ జనాన్ని అలరించాలని కోరుతున్నారు. కానీ అవంతికి తన పిక్స్ అయితే షేర్ చేసింది గానీ.. సినీ ఇండస్ట్రీ గురించి ఎలాంటి క్యాప్షన్, కామెంట్ చేయలేదు. దీంతో ఆమె క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు.

మరోవైపు ఈ విషయంపై కుష్బూ ఎలాంటి రెస్పాన్స్ కానట్లు తెలుస్తోంది. ఒకప్పడు, హీరో, హీరోయిన్లు తమ కూతుళ్లను ఇండస్ట్రీకి తీసుకురావాలంటే వెనుకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీంతో కుష్బూ కూడా అవంతికను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుష్బూ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తమిళనాడు తరుపున బీజేపీకి కీలక నేతగా ఉన్నారు. ఈ తరుణంలో ఆమె కూతురు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

 

View this post on Instagram

 

A post shared by avantika (@avantikasundar)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular