Sandeep reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు అంటే ఇండస్ట్రీ మొత్తం ఆ దర్శకుడి చుట్టూ తిరగడం కామన్. ఆ దర్శకులతో ఆయన ఒక్క సినిమా అయిన చేయాలని హీరోలు కాంబినేషన్ ని సెట్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దర్శకుడు అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి ‘ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సందీప్ వంగ.
అనిమల్ సినిమాతో బాలీవుడ్ ని సైతం షేక్ చేశాడు. ఇక ఈ సినిమాతో దాదాపు 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ఒక స్టార్ డైరెక్టర్ గా కూడా తన ప్లేస్ ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాకి ముందు ఆ స్టోరీని తీసుకొని చాలామంది స్టార్ హీరోలని కలిశాడు. అందులో అల్లు అర్జున్ ఒకరు. అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ముందుగా ఈ కథని ఆయనకు చెప్పాడు.
అయినప్పటికీ తను ఈ స్టోరీ లో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయనే కారణం తో ఆ కథని రిజెక్ట్ చేశాడు. దాని తర్వాత శర్వానంద్ ను పెట్టీ ఈ సినిమా చేయాలని సందీప్ అనుకొని ఆయనకి కథ చెప్పాడు. కానీ ఆయన కూడా సేమ్ అదే రీజన్ తో ఈ స్టోరీని రిజెక్ట్ చేయడంతో విక్టరీ వెంకటేష్ దగ్గరికి కూడా ఈ కథ తీసుకొని వెళ్ళాడు. ముందు నుంచే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉండటం వల్ల దీంట్లో బోల్డ్ కంటెంట్ అధికంగా ఉందని వెంకటేష్ కూడా ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా స్టోరీని పక్కనపెట్టి, నానితో ఒక సినిమా చేయాలని కూడా ప్లాన్ చేశాడు. అయినప్పటికీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు.
ఇక దాంతో అర్జున్ రెడ్డి సినిమాను కొత్త హీరో అయిన విజయ్ దేవరకొండ తో తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ అయిన సంచలనాన్ని సృష్టించింది. ఇక దాంతో ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు అంటే సందీప్ వంగా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు…