Superstitions Facts: దేశంలో చాలా మంది నమ్మకాలపై ఆధారపడి జీననాన్ని సాగిస్తుంటారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయాన్ని పాటించేవారు ప్రతీ దానికి ఒక సమయం, సందర్భం చూసి చేస్తుంటారు. కొందరు వీటిని బలంగా నమ్ముతుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటుంటారు. శాస్త్రాలు, జ్యోతిష్యాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారు శకునాలను బలంగా నమ్ముతారని తెలుస్తోంది.

వీరు బయటకు వెళ్లేముందు అటు ఇటు చూసుకుంటూ వెళ్తారు. అనుకోకుండా పిల్లి ఎదురువచ్చినా, కాకి భుజంపై తన్నినా ఏదో చెడు జరగబోతోందని కీడును శంకిస్తుంటారు. అందుకోసం పరిహారాలు చేయాలంటూ చెబుతుంటారు. పిల్లి ఎదురొస్తే వెళ్లే పని కాదని కొందరు నమ్ముతుంటారు. కాలి తలపై తంతే ఏకంగా ప్రాణగండం సంభవించవచ్చునని శాస్త్రం ఘోషిస్తోందని పండితులు హెచ్చరిస్తుంటారు.
అసలు శకునాల గురించి శకున్ శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. జంతువులు లేదా పక్షులు మనకు శుభం, అశుభ సూచకాలను ఇస్తుంటాయట.. వీటి ఆధారంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, శకున శాస్త్రం ఏం చెబుతుందని ఇప్పుడు తెలుసుకుందాం.. ఉదయాన్నే ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్న టైంలో తెల్లని హంస, తెల్ల గుర్రం, నెమలి, చిలుక కనిపిస్తే దానిని శుభ సూచకంగా పరిగణించాలని శకున శాస్త్రం చెబుతోంది. అదేవిధంగా హిందూ ధర్మంలో ఆవును చాలా పవిత్రమైన జంతువుగా చూస్తారు. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే క్రమంలో తెల్లని ఆవు కనిపించినా, ఆవు దూడకు పాలు ఇవ్వడాన్ని మీరు చూస్తే ఆ ప్రయాణం విజయవంతం అవుతుందట.. మనం ఏదైనా పనిచేయాలని భావించిన టైంలో చుట్టుపక్కల పిల్లి ప్రసవిస్తే శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సంపదకు సూచిక.
Also Read: చంద్రబాబుపై జగన్ కు ఎంత ప్రేమో బయటపడింది!
ఇక పిల్లి ఏడుపు అనేది విపత్తుకు కారణం. పనిమీద బయటకు వెళుతున్నప్పుడు పిల్లి అడ్డొస్తే అది పూర్తికాదని శాస్త్రం చెబుతోంది. కాకి మన ఇంటిపై అరుస్తూ కనిపిస్తే అతిథులు వస్తారని చుట్టుపక్కల వారు ఇంట్లోని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ కాకి మీ తలపై లేదా మీ భుజంపై తన్నితే అది చెడు సంకేతంగా భావించాలని శకున శాస్త్రం స్పష్టం చేస్తోంది. ప్రమాదం లేదా వ్యాధులకు సంకేతమట.. ఇక బయటకు వెళ్లే క్రమంలో బురదలో తిరిగిన పందిని చూస్తే అది శుభ సూచకం కానీ, ఆ బురద ఎండిపోయి ఉంటే అది అశుభాన్ని కలుగజేస్తుంట.. చివరగా మన వెనుక గాడిద శబ్దం చేసిందంటే అది అశుభ సంకేతంగా పరిగణించాలి.
[…] Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. దీప ప్రకృతి వైద్యశాలకు వెళ్లి రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అని ఆమెని చూసి నమస్కరించుకోవాలి అని లోపలికి వెళ్లి చూస్తుంది. అక్కడ సౌందర్య, ఆనందరావు ఉండేసరికి వారిని చూసి అలాగే షాక్ అవుతూ ఏడుస్తుంది. ఇక్కడికి వచ్చారు ఏంటి అని ఆలోచనలో పడుతుంది. […]
[…] Business Ideas: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటర్ తాగడానికి అలవాటు పడ్డారు.ఈ క్రమంలోని మినరల్ వాటర్ కి ఎంతో డిమాండ్ ఏర్పడటంతో ప్రతి ఒక్క ఊరిలోనూ ఈ విధమైనటువంటి మినరల్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న చాలామందికి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరు పర్మిషన్ తీసుకోవాలనే ఐడియా ఉండదు. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఎవరి అనుమతి తీసుకోవాలి ఎలా ఏర్పాటు చేయాలి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల మనకు ఎంత లాభం వస్తుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…. […]
[…] Google Search: కాలంలో సాంకేతిక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండటంతో చాలా వరకు కావలసిన సమాచారాన్ని గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు.ఇకపోతే తాజాగా గూగుల్ తెలిపిన నివేదికల ప్రకారం ఎక్కువగా అమ్మాయిలు దేని కోసం గూగుల్ సెర్చ్ చేశారో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం సుమారు 150 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అందులో 60 మిలియన్ల మంది మహిళలు ఉండడం విశేషం. ఇక వీరిలో 75 శాతం మంది 15 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వారు ఉండటం విశేషం. మరి ఈ నివేదిక ప్రకారం అమ్మాయిలు గూగుల్లో దేనికోసం ఎక్కువగా సెర్చ్ చేశారు అనే విషయానికి వస్తే… […]
[…] Coronavirus : టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఎన్టీఆర్ మెసేజ్ చేస్తూ.. ‘మామయ్య చంద్రబాబుగారు మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి. అలాగే నారా లోకేష్ కూడా త్వరగా కరోనా నుంచి బయటపడాలి’ అని ట్వీట్ చేశాడు. […]