Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Srinivas : ఇదేందయ్యా ఇదీ.. సగం సినిమా అయ్యాక హీరోయిన్ ను మార్చేశారు

Bellamkonda Srinivas : ఇదేందయ్యా ఇదీ.. సగం సినిమా అయ్యాక హీరోయిన్ ను మార్చేశారు

Bellamkonda Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ కోసం ఎంతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ఒక్క సక్సెస్ కూడా లేకపోవడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకే కమర్శియల్ సినిమాల దర్శకులను సైతం పక్కనపెట్టి సాగర్ చంద్ర అనే ఇన్నోవేటివ్ డైరెక్టర్ ని తెరపైకి తెచ్చాడు. కంటెంట్ ఉండే సినిమాలకు మంచి విజయాలు వస్తున్న సంగతి తెలిసిందే. అదే జోనర్ లో కథలు తెరకెక్కించడంలో సాగర్ చంద్ర మంచి పట్టున్న దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇంత కాలం అతని కథలు కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచి నేపథ్యంలో అతడికి కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెల్లంకొండ శ్రీనివాస్ ఎంతో మంది దర్శకులను పక్కన పెట్టి మరీ క్రియేటివ్ మేకర్ ని లైన్ లోకి తెచ్చుకున్నారట. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో టైసన్ నాయుడు అనే సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు అనే క్యూరియాసిటీ నెలకొందట నెటిజన్ లలో.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?

అయితే ఇప్పటికే ఇందులో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. అయితే తాజాగా యూత్ ఐకాన్ గా మారిన నేహాశెట్టిని తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఆమెనే మెయిన్ లీడ్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది కూడా. ప్రగ్యా కన్నా నేహాశెట్టికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందని.. ఆమెను తీసుకున్నారట. డీజే టిల్లు తో ఆమె ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. రాధిక అక్కగా కుర్రాళ్ల మనసుల్ని దోచింది ఈ అమ్మడు. ఆ తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. అదే జోష్ లో ఇప్పుడు బెల్లంకొడతో జతకట్టనుంది.

ఈ నేపథ్యంలో బెల్లంకొండకి జోడీగా నేహాని ఎంపిక చేశారట మేకర్స్. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైంది. ఆమె ఎంట్రీ కన్ఫామ్ అయితే గనుక మధ్యలో నేహాశెట్టి జాయిన్ అవుతన్నట్టే.. అయితే నేహాని తెరపై ఎంత అందంగా చూపిస్తారనేది కీలకం కానుంది. ఈ హీరోయిన్ అంటే యూత్ లో అంచనాలు భారీగానే ఉంటాయి. మరి సాగర్ చంద్ర ఈమెను అభిమానులు అనుకున్నట్టు చూపిస్తారా లేదా అనేది చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper