Raviteja : టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇదే విధానాన్ని పాటిస్తుంటారు ఈ హీరో. గత సంవత్సరం ఏకంగా మూడు సినిమాలతో అలరించిన రవితేజ తాజాగా ఈగల్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో రూపొందింది.
షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమాను సంక్రాంతి కానుకగా తీసుకురావాలి అనుకున్నారు మేకర్స్. కానీ అనుకున్న సమయానికి తీసుకురాకుండా.. ఊహించని విధంగా షాక్ ఇచ్చారు చిత్ర యూనిట్. దీంతో ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్లు స్పీడ్ పెంచింది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.
ఇక ఈగల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో రవితేజ లవ్ ట్రాక్ సూపర్ హైలెట్ కానుంది అని టాక్. ఏ తెలుగు సినిమాలో కూడా చూడని విధంగా డిజైన్ చేశారట మేకర్స్. అంతేకాదు ప్రస్తుతం మరో క్రేజ్ అప్డేట్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో పత్తి పండించే వ్యవసాయదారుడిగా కనిపిస్తారట రవితేజ. పత్తి రైతుల సమస్యలపై పోరాడుతూ.. పత్తి మాఫియాను అంతం చేస్తారట. ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లలో పత్తి మెయిన్ గా కనిపిస్తోంది.
ట్రైలర్ లో కూడా అనుపమ అందరినీ కంగారు పెట్టింది. పత్తి, ప్రాంతం కాదు.. దాన్ని పండించేవాడు అని చెబుతోంది. దీంతో రవితేజ పత్తి పండించే రైతుగా కనిపిస్తాడు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారట. కానీ ప్రమోషన్ లలో ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయటపెట్టలేదు మేకర్స్. మరి ఈ విషయం ఏకంగా సినిమాలో మాత్రమే చూపిస్తారేమో చూడాలి.