Dude Movie Review : నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, నేహా శెట్టి, శరత్ కుమార్, హృదు హరూన్ తదితరులు.
సంగీతం: సాయి అభ్యంకర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
దర్శకత్వం: కీర్తీశ్వరన్
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
లవ్ టుడే, డ్రాగన్ లాంటి చిత్రాలతో అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా డ్యూడ్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళ చిత్రం అయినప్పటికీ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా యూత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ తమిళ డ్యూడ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది చూద్దాం.
మినిస్టర్ ఆదికేశవులు(శరత్ కుమార్) కూతురు కుందన(మమిత బైజు). ఆయన మేనల్లుడే గగన్(ప్రదీప్ రంగనాథన్). కుందన, గగన్ ను ప్రేమిస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం అముద(నేహా శెట్టి) ని ప్రేమిస్తాడు. గగన్ ఎంత ప్రేమించినా అముద మాత్రం మరొకరిని పెళ్లిచేసుకుని వెళ్ళిపోతుంది. దీంతో మన హీరో లవ్ స్టోరీ ఫెయిల్ అవుతుంది. తర్వాత మెల్లగా కుందన పట్ల తనకున్నది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదని, ప్రేమ అని గ్రహిస్తాడు. ఆలస్యం అన్ని చోట్లా పనికిరాదు కదా.. అలాగే ఇక్కడ హీరోగారు ఆలస్యం చేసేసరికి కుందన హీరోకు ఇచ్చిన మనసుని వెనక్కు తీసుకుని దాన్ని జాగ్రత్తగా మరో అబ్బాయి పార్థు(హృదు హరూన్) కు ఇచ్చేస్తుంది. దీంతో గగన్ తన మేనమామ కూతురి ప్రేమను గెలిపించడానికి బేషరతుగా మద్దతు ఇవ్వాలనుకుంటాడు. కానీ అమ్మాయి తండ్రి, హీరో మేనమామ ఆదికేశవులు అందుకు ఒప్పుకోడు. తర్వాత ఏం జరిగిందనేది మాత్రం మీరే చూసి తెలుసుకోవాలి డ్యూడ్.
ALSO READ : Telusu Kada Movie Review : మీకు తెలుసా మూవీ రివ్యూ
లవ్వులు, బ్రేకప్ లు, ఫ్రెండ్షిప్ లు.. ఇవే యూత్ ఫుల్ సినిమాకు ముడిసరుకు. ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ కు కాసింత ఫన్, కూసింత పెప్పీ మ్యూజిక్, విజువల్స్ మ్యాజిక్ కనుక తోడయిందంటే వెంటనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఫ్లేవర్ లో సాగింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల తరహాలోనే ఈ సినిమాలో కూడా తన ఎనర్జీతో సినిమాను ముందుకు నడిపించాడు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం కొంత ఫన్ తగ్గింది, ఒక్కసారి కాన్ ఫ్లిక్ట్ ఏంటో ప్రేక్షకులకు అర్థం అయ్యాక మిగతా ప్రిడిక్టబుల్ గా మారిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆశించినంత హై మాత్రం సెకండ్ హాఫ్ ఇవ్వలేకపోయింది. క్లైమాక్స్ కూడా హడావుడిగా ముగించినట్టు అనిపించింది.
ప్రదీప్ రంగనాథన్ తన స్టైల్ లోనే ఈ సినిమాలో కూడా ఈజ్ తో నటించాడు, కొన్ని చోట్ల మాత్రం ధనుష్ లా కనిపిస్తున్నాడు. సినిమాలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ ట్రాక్ చక్కగా కుదిరింది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ఈ సినిమాలో కూడా తనదైన ఛార్మ్ తో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో తన నటన సినిమాను ఎలివేట్ చేసింది.
మొదటి సినిమా అయినా దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ సినిమాను బాగా డీల్ చేశాడనే చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంత వీక్ అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకుండా చూసుకున్నాడు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చింది. పాటలు కూడా యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా బూమ్ బూమ్ పాట సౌండింగ్, విజువల్స్, కొరియోగ్రఫీ అన్నీ సూపర్ గా ఉన్నాయి. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాగుంది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. వీక్ సెకండ్ హాఫ్
2. రొటీన్ ఎండింగ్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. ప్రదీప్, మమిత, శరత్ కుమార్ ల నటన
2. సాయి అభ్యంకర్ ట్రెండీ మ్యూజిక్
3. విజువల్స్
ఫైనల్ వర్డ్: యావరేజ్.. డ్యూడ్
రేటింగ్: 2.5/5