Homeఎంటర్టైన్మెంట్గోపిచంద్ కోసం మారుతి కొత్త ప్రమోషన్స్ !

గోపిచంద్ కోసం మారుతి కొత్త ప్రమోషన్స్ !

హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, చిత్ర పరిశ్రమలో అన్ని ఉన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఆ అదృష్టమే ఈ హీరోకి ఆమడ దూరంలో ఉండిపోతుంది. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా ఇవ్వాలనే కసితో ప్రమోషన్స్ లో కూడా క్రియేటివిటీని చూపిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ […]

Gopichand Maruthi
హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. వరుస పరాజయాలతో విసిగిపోయాడు. సీజన్ కి ఒకటి చొప్పున సినిమా రిలీజ్ చేసినా విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అందుకే, చిత్ర పరిశ్రమలో అన్ని ఉన్నా అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఆ అదృష్టమే ఈ హీరోకి ఆమడ దూరంలో ఉండిపోతుంది. ఇలాంటి హీరోకి మంచి హిట్ సినిమా ఇవ్వాలనే కసితో ప్రమోషన్స్ లో కూడా క్రియేటివిటీని చూపిస్తూ సినిమా చేస్తున్నాడు మారుతి. డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ తాజాగా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారు.

Also Read: ‘ఉప్పెన‌’ కోసం ఇంత రిస్కా..? ముందే తెలిస్తే వ‌ద్ద‌నేవాణ్నిః నాగ‌బాబు

కాగా ఈ సినిమా టైటిల్ ను రేపు పూజా కార్యక్రమంతో రివీల్ చేస్తున్నట్టుగా ఓ వినూత్న పోస్టర్ డిజైన్ చేసి పోస్ట్ చెసారు. ఈ పోస్టర్ లో ‘అరేయ్ ఒక వంద ఇస్తే మారుతి – గోపీచంద్ సినిమా టైటిల్ చెబుతా, రేపు ముహూర్తం టైంకి’ అంటూ రాసున్న వ్యాఖ్యలు మొత్తానికి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ఎలా ఉండబోతున్నాయో రేపు రివీల్ కానుంది. అయితే, ఈ సినిమా కోసమే మారుతి ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ రిజిస్టర్ చేశారని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. ఇక మారుతి నుండి మాత్రం మినిమం గ్యారంటీ మూవీని ఆశించొచ్చు,

Also Read: బ్యాంక్‌ డీటెయిల్స్ చెప్తే సంక‌నాకి పోతారు.. బ్ర‌హ్మానందం వైర‌ల్ వీడియో!

పైగా ఈ సినిమా అల్లు అరవింద్ కంపెనీ నుండి వస్తుంది. అన్నిటికీ మించి సినిమలో మంచి ఫన్ ఉంటుందట, మరి మారుతి సినిమాలో కామెడీ అంటే వేరే చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ సారి గోపీచంద్ కి మంచి విజయం దక్కుతుందనేది అందరి నమ్మకం. గోపీచంద్ కి మంచి హిట్ సినిమా పడితే చూడాలని అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. చూడాలి మరి, మారుతి హిట్ ఇస్తాడో.. లేక గోపిచందే ఎప్పటిలాగా మారుతికే ప్లాప్ ఇస్తాడో.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper